ETV Bharat / sports

ICC Hall of Fame: వినూ మన్కడ్​కు అరుదైన గౌరవం - ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్

'హాల్​ ఆఫ్​ ఫేమ్'​లో చోటు దక్కించుకున్న పది మంది క్రికెటర్ల పేర్లను ఐసీసీ ప్రకటించింది. భారత్​ తరఫున వినూ మన్కడ్​తో పాటు శ్రీలంక మాజీ క్రికెటర్​ కుమార సంగక్కరకు ఈ అరుదైన గౌరవం దక్కింది.

vinoo mankad, former india cricketer
వినూ మన్కడ్, భారత మాజీ క్రికెటర్
author img

By

Published : Jun 13, 2021, 9:40 PM IST

'హాల్​ ఆఫ్​ ఫేమ్​' జాబితాలో చోటు దక్కించుకున్న క్రికెటర్ల పేర్లను ఐసీసీ ప్రకటించింది. క్రికెట్​ను ఐదు శకాలుగా విభజించి.. ఒక్కో శకం నుంచి ఇద్దరు ఆటగాళ్ల చొప్పున ఈ జాబితాలో చేర్చింది. మొత్తం పది మందిలో ఇండియా నుంచి వినూ మన్కడ్​తో పాటు శ్రీలంక నుంచి కుమార సంగక్కర, జింబాబ్వే నుంచి ఆండీ ఫ్లవర్​కు ఈ గౌరవం దక్కింది.

1918 కంటే ముందు క్రికెట్​ ఆడిన వారిలో ఆబ్రే ఫాల్క్‌నర్(దక్షిణాఫ్రికా), మోంటీ నోబ్లే(ఆస్ట్రేలియా)లకు ఈ జాబితాలో చోటు కల్పించింది. ఇంటర్​ వార్​ క్రికెట్​(1918-1945) తరం నుంచి సర్ లియరీ కాన్స్టాంటైన్(వెస్టిండీస్), స్టాన్ మెక్కేబ్​(ఆస్ట్రేలియా)లకు ఈ గౌరవాన్ని కల్పించింది ఐసీసీ. యుద్ధం తర్వాత క్రికెట్ శకం(1946-1970) నుంచి వినూ మన్కడ్​(ఇండియా), టెడ్​ డెక్స్టర్​(ఇంగ్లాండ్)లకు ఈ అవకాశాన్ని ఇచ్చింది ఐసీసీ.

వన్డే (1971-1995) తరం నుంచి డెస్మండ్​ హైన్స్​(వెస్టిండీస్), బోబ్​ విల్లీస్​(ఇంగ్లాండ్)లకు చోటు దక్కింది. ఆధునిక క్రికెట్​((1996-2016) శకం నుంచి ఆండీ ఫ్లవర్​(జింబాబ్వే), కుమార సంగక్కర(శ్రీలంక)లకు ఈ అరుదైన గౌరవం దక్కింది.

భారత క్రికెటర్​ వినూ మన్కడ్​.. గొప్ప ఆల్​రౌండర్​గా పేరు సంపాదించాడు. 44 టెస్ట్​ల్లో ప్రాతినిధ్యం వహించి 2,109 పరుగులు చేశాడు. 162 వికెట్లతో బౌలర్​గానూ తనదైన ముద్ర వేశాడు. ఈయన పేరు మీదుగానే 'మన్కడింగ్'కు ఆ పేరు వచ్చింది.

ఇదీ చదవండి: WTC: ఐసీసీ హాల్​ ఆఫ్​​ ఫేమ్​లో మరో పది మంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.