Team India Middle Order: టీమ్‌ఇండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌ను జట్టులోకి తీసుకుంటే మిడిలార్డర్ సమస్యకు పరిష్కారం దొరికినట్లేనని మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 0-1తో వెనుకబడిపోయింది. దీనిపై మంజ్రేకర్ స్పందించాడు.
"టీమ్‌ఇండియాను గత కొద్ది కాలంగా మిడిలార్డర్ సమస్య వేధిస్తోంది. ఐదో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన రిషభ్ పంత్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోవడం.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అరంగేట్ర ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ విఫలం కావడం భారత్ విజయావకాశాలను దెబ్బతీసింది. అందుకే, మిడిలార్డర్‌లో సమర్థంగా రాణించగల సూర్యకుమార్ యాదవ్‌ను జట్టులోకి తీసుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుందనుకుంటున్నాను. దాంతో పాటు జట్టు కూర్పులో స్వల్ప మార్పులు చేయాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో భారీ లక్ష్యాలను ఛేదించడం అంత సులభం కాదు. ప్రత్యేకించి వన్డే మ్యాచుల్లో అది మరింత కష్టం. ఎవరో ఒకరు బ్యాటింగ్ భారాన్ని మోయాల్సి ఉంటుంది. శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ జట్టుకి మెరుగైన ఆరంభం ఇచ్చినా.. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్‌పై భారత్ ఆశలు వదులు కోవాల్సి వచ్చింది" అని సంజయ్ మంజ్రేకర్ అన్నాడు.
ఇదీ చదవండి:
టీమ్‌ఇండియా-వెస్టిండీస్ సిరీస్.. రెండు వేదికల్లోనే 6 మ్యాచ్‌లు!