ETV Bharat / state

ఈ నెల 4న థియేటర్‌ నిర్వహణను మైత్రీ మూవీస్ తీసుకుంది : సంధ్య థియేటర్​ యాజమాన్యం - SANDHYA THEATRE MANAGEMENT ANSWER

పోలీసుల నోటీసులకు సమాధానం ఇచ్చిన సంధ్య థియేటర్ యాజమాన్యం - సంధ్య థియేటర్‌కు అన్ని అనుమతులున్నాయని వెల్లడి

Sandhya Theatre Management Answer to Police Notice
Sandhya Theatre Management Answer to Police Notice (EENADU)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 29, 2024, 6:36 PM IST

Sandhya Theatre Management Answer to Police Notice : ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద పుష్ప-2 ప్రీమియర్‌ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి థియేటర్‌ మేనేజ్​మెంట్​కు పోలీసులు నోటీసులను ఇచ్చారు. సంధ్య థియేటర్‌కు అన్ని అనుమతులు ఉన్నాయని పేర్కొంటూ పోలీసులు ఇచ్చిన నోటీసులకు థియేటర్‌ యాజమాన్యం సమాధానం పంపింది.

డిసెంబరు 4న పుష్ప-2 ప్రీమియర్‌ షోకు 80 మంది థియేటర్‌ సిబ్బంది విధుల్లో ఉన్నారని పోలీసులకు ఇచ్చిన సమాధానంలో తెలిపింది. డిసెంబరు 4, 5న సినిమా థియేటర్‌ నిర్వహణను మైత్రీ మూవీ మేకర్స్‌ తీసుకుందని తెలిపింది. సినిమాల రిలీజ్​లకు గతంలోనూ హీరోలు థియేటర్​నకు వచ్చినట్లుగా వివరించింది. సంధ్య థియేటర్‌లో కార్లు, బైక్‌లకు ప్రత్యేక పార్కింగ్‌ ఉందని సంధ్య థియేటర్​ యాజమాన్యం అని తెలిపింది. ఈ మేరకు ఈ వివరాలన్నింటితో కూడిన 6 పేజీల లేఖను సంధ్య థియేటర్‌ యాజమాన్యం పోలీసులకు పంపింది.

ఇంతకీ ఏం జరిగిందంటే? : డిసెంబరు 4వ తేదీన సంధ్య థియేటర్‌ వద్ద జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడి కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం విధితమే. బాధిత కుటుంబానికి ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్‌ 50లక్షల రూపాయలు, హీరో అల్లు అర్జున్‌ రూ.కోటి, దర్శకుడు సుకుమార్​ రూ.50లక్షలను, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రూ.25లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు.

సంధ్య థియేటర్ ఘటన - లైవ్ వీడియో రిలీజ్ చేసిన సీపీ

సంధ్య థియేటర్​కు షోకాజ్​ నోటీసులు - 10 రోజుల్లో వివరణ ఇవ్వాలన్న సీవీ ఆనంద్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.