ETV Bharat / sports

కొత్త ఐపీఎల్ ఫ్రాంచైజీ రేసులో ఫుట్​బాల్ క్లబ్!

వచ్చే ఏడాది ఐపీఎల్​లో రెండు కొత్త జట్లు(IPL 2022 New teams) చేరనున్న తరుణంలో ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. కొత్త ఫ్రాంచైజీలను సొంతం చేసుకునేందుకు బీసీసీఐ టెండర్లను ఆహ్వానించగా.. ప్రముఖ ఫుట్​బాల్​ క్లబ్ 'మాంచెస్టర్ యునైటెడ్'(Manchester United News) దీనిపై ఆసక్తి చూపినట్లు సమాచారం.

IPL
ఐపీఎల్
author img

By

Published : Oct 21, 2021, 8:13 PM IST

ఐపీఎల్ 2022(IPL 2022 New Team Name) నేపథ్యంలో రెండు కొత్త జట్ల కోసం ఇటీవలే టెండర్లను ఆహ్వానించింది బీసీసీఐ. ఈ నేపథ్యంలో ఓ జట్టును కొనుగోలు చేసేందుకు ప్రముఖ పుట్​బాల్​ క్లబ్​ 'మాంచెస్టర్​ యునైటెడ్'​(Manchester United News) ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్లబ్ యాజమాన్యమైన గ్లేజర్ కుటుంబం(Glazer Family) బీసీసీఐ నుంచి టెండర్ పత్రాలను కూడా తీసుకున్నట్లు ఓ పత్రిక తమ కథనంలో పేర్కొంది.

విదేశీ కంపెనీలు కూడా ఐపీఎల్​ టీమ్​ను సొంతం చేసుకునేందుకు టెండర్లను ఆహ్వానించింది బీసీసీఐ. ఒకవేళ ఆ సంస్థలకు బిడ్ దక్కితే వారు స్వదేశంలో కూడా కంపెనీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే.. అమెరికాకు చెందిన గ్లేజర్​ కుటుంబం ఐపీఎల్​లో ఓ​ ఫ్రాంచైజీ దక్కించుకునేందుకు బిడ్ వేస్తుందా? లేదా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

ఒకవేళ మాంచెస్టర్​ క్లబ్​ కొత్త జట్టును దక్కించుకుంటే.. ఐపీఎల్​కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుందని బీసీసీఐ భావిస్తోందని సమాచారం. దీని వల్ల లీగ్​ విస్తరణ కూడా జరపొచ్చని బీసీసీఐ ప్లాన్​ చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ఫుట్​బాల్​ దిగ్గజం, పోర్చుగల్​ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ప్రస్తుతం మాంచెస్టర్​ క్లబ్​ జట్టుకే ప్రాతనిధ్యం వహిస్తున్నాడు. ..గ్లేజర్​ కుటుంబం మాంచెస్టర్​తో పాటు అమెరికా ఫుట్​బాల్​ లీగ్(ఎన్​ఎఫ్ఎల్)కు చెందిన 'తంప బే బకనీర్స్'​కూ యజమాని కావడం గమనార్హం.

రేసులో ఎవరెవరు..

కొత్త ఫ్రాంచైజీల కోసం అదానీ గ్రూప్, టొరెంట్ ఫార్మా, అరబిందో ఫార్మా, ఆర్​పీ సంజీవ్ గోయెంక గ్రూప్, హిందుస్థాన్ టైమ్స్ మీడియా, జిందాల్ స్టీల్ సంస్థలు పోటీ పడుతున్నాయి.

ఇదీ చదవండి:

ఐపీఎల్​లో కొత్త జట్లు.. ధర చూస్తే షాకవ్వాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.