దుబాయ్ వేదికగా దిల్లీ(dc vs csk 2021)తో జరిగిన ఐపీఎల్ 2021(ipl 2021 news) తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. చివరిలో వచ్చిన ధోనీ(dhoni kohli).. మెరుపు ఇన్నింగ్స్ ఆడి తనదైన శైలిలో ఫినిషింగ్ ఇచ్చి.. జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. చివరి ఓవర్లో ఓ సిక్స్, మూడు ఫోర్లు బాది విజయానికి అవసరమైన 18 పరుగులు(6 బంతుల్లో) చేశాడు ధోనీ. ఈ నేపథ్యంలో అతడిపై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ(kohli on dhoni).. ధోనీ 'గొప్ప ఫినిషర్' అని కితాబిచ్చాడు.
-
Anddddd the king is back ❤️the greatest finisher ever in the game. Made me jump Outta my seat once again tonight.@msdhoni
— Virat Kohli (@imVkohli) October 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Anddddd the king is back ❤️the greatest finisher ever in the game. Made me jump Outta my seat once again tonight.@msdhoni
— Virat Kohli (@imVkohli) October 10, 2021Anddddd the king is back ❤️the greatest finisher ever in the game. Made me jump Outta my seat once again tonight.@msdhoni
— Virat Kohli (@imVkohli) October 10, 2021
"దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మునపటి ధోనీ మళ్లీ కనిపించాడు. చివరిలో ధోనీ ఇన్నింగ్స్ నన్ను ఎగిరి గెంతులేసేలా చేసింది. ఎప్పటికీ ధోనీయే గొప్ప ఫినిషర్" అని కోహ్లీ ట్వీట్ చేశాడు.
దిల్లీ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని చెన్నై(CSK vs DC 2021) ఛేదించింది. దిల్లీ బౌలర్లను ఉతప్ప(63) ఉతికారేశాడు. అతడికి గైక్వాడ్(70) మద్దతుగా నిలిచాడు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనీ.. ఓ సిక్సర్ కొట్టాడు. ఆరు బంతులకు 12 పరుగులు చేయాల్సి రాగా.. వరుసగా మూడు ఫోర్లు బాది సీఎస్కేను విజయ తీరాలకు చేర్చాడు.
తొలి ఇన్నింగ్స్ ఇలా..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ నిర్ణీత 20ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి.. 172 పరుగులు చేసింది. పృథ్వీ షా(60), పంత్(51*), హెట్మయర్(37) రాణించారు. పంత్-హెట్మయర్ భాగస్వామ్యం(83) ఆ ఇన్నింగ్స్‌కు హైలైట్‌గా నిలిచింది.
ఇదీ చూడండి: CSK vs DC: ఉత్కంఠ పోరులో విజయం.. ఫైనల్‌కు సీఎస్కే