Lucknow IPL Team Name: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వచ్చే ఏడాది నుంచి కొత్తగా పాల్గొననున్న లఖ్‌నవూ ఫ్రాంఛైజీ పేరును.. ఆ జట్టు ఓనర్ సంజీవ్ గొయెంకా వెల్లడించారు. అభిమానుల సూచన మేరకు 'లఖ్‌నవూ సూపర్ జెయింట్స్' పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. లఖ్‌నవూ ప్రాంఛైజీకి పేరు సూచించాలని జనవరి 3న ఆ జట్టు యాజమాన్యం 'నామ్ బనావో.. నామ్ కమావో' పేరిట ఆన్‌లైన్‌లో ఓ పోటీ నిర్వహించింది. అక్కడ అభిమానులు సూచించిన ఉత్తమ పేర్లను పరిగణనలోకి తీసుకున్న జట్టు యాజమాన్యం.. ఆఖరికి 'లఖ్‌నవూ సూపర్ జెయింట్స్' పేరును ఖరారు చేసింది.
-
And here it is,
— Lucknow Super Giants (@TeamLucknowIPL) January 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Our identity,
Our name.... 🤩🙌#NaamBanaoNaamKamao #LucknowSuperGiants @BCCI @IPL @GautamGambhir @klrahul11 pic.twitter.com/OVQaw39l3A
">And here it is,
— Lucknow Super Giants (@TeamLucknowIPL) January 24, 2022
Our identity,
Our name.... 🤩🙌#NaamBanaoNaamKamao #LucknowSuperGiants @BCCI @IPL @GautamGambhir @klrahul11 pic.twitter.com/OVQaw39l3AAnd here it is,
— Lucknow Super Giants (@TeamLucknowIPL) January 24, 2022
Our identity,
Our name.... 🤩🙌#NaamBanaoNaamKamao #LucknowSuperGiants @BCCI @IPL @GautamGambhir @klrahul11 pic.twitter.com/OVQaw39l3A
'నామ్ బనావో నామ్ కామావో పోటీకి మీ నుంచి వచ్చిన అపూర్వ స్పందనకు ధన్యవాదాలు. లక్షలాది మంది అభిమానులు తమకు తోచిన పేర్లను సూచించారు. వాటి ఆధారంగానే మా ఐపీఎల్ జట్టుకు పేరును ఎంపిక చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్‌లో కూడా మీ ఆధారాభిమానాలు ఇలాగే కొనసాగుతాయని ఆశిస్తున్నాను' అని సంజీవ్ గోయెంకా పేర్కొన్నారు. వచ్చే సీజన్ నుంచి 10 జట్లు ఐపీఎల్‌లో పోటీ పడనుంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో(ఎల్‌ఎస్‌జీ) పాటు అహ్మదాబాద్ నుంచి మరో జట్టు ఐపీఎల్‌లోకి అడుగుపెట్టనున్నాయి. ఎల్ఎస్‌జీ జట్టుకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహించనున్నాడు.
ఇదీ చూడండి: ధోనీ లేక వాళ్లు విఫలమవుతున్నారు: దినేశ్ కార్తిక్