ETV Bharat / sports

టీమ్​ఇండియా టెయిలెండర్లా మజాకా - లోయర్​ఆర్డర్​

ఇంగ్లాండ్​తో జరుగుతున్న టెస్టు సిరీస్​ సహా అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్​ సిరీస్​లో కూడా టీమ్​ఇండియాను లోయర్​ ఆర్డర్​ కీలక పాత్ర పోషించింది. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేసి.. ఇక అద్భుతం జరిగితే తప్ప టీమ్‌ఇండియా కోలుకోదనిపించిన సందర్భాల్లో లోయర్​ఆర్డర్​ జట్టును ఆదుకుంటోంది. టాప్‌, మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమైనా.. మేమున్నాం అంటూ ఆదుకుని జట్టును గట్టెక్కిస్తున్నారు.

team india lower order
టీమ్​ఇండియాను ఆదుకుంటున్న టెయిలెండర్లు
author img

By

Published : Aug 18, 2021, 7:14 AM IST

టాప్‌ ఆర్డర్‌లో బ్యాట్స్‌మెన్‌ పరుగులు సాధిస్తే.. వేన్నీళ్లకు చన్నీళ్లలా ఏదో కొన్ని పరుగులు సాధిస్తే గొప్ప అన్నట్టుండేది భారత క్రికెట్లో లోయర్‌ఆర్డర్‌ బ్యాటింగ్‌. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. గత ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో సిరీస్‌ నుంచి మన టెయిలెండర్ల ప్రదర్శన మెరుగైంది.

సిడ్నీలో మూడో టెస్టులో 102 పరుగులకే 3 వికెట్లు పడితే వికెట్‌కీపర్‌ పంత్‌ (97).. జట్టును ఆదుకున్నాడు. అతడి స్ఫూర్తితో విహారి (23; 161 బంతుల్లో), అశ్విన్‌ (39; 128 బంతుల్లో) గొప్ప పోరాట పటిమను ప్రదర్శించి ఓటమి నుంచి తప్పించారు. ఆసీస్‌ బౌలర్లను అశ్విన్‌ ఎదుర్కొన్న తీరు ప్రశంసలందుకుంది.

ఇక ఎన్నో మలుపులు తిరిగిన నాలుగో టెస్టులో అయితే టీమ్‌ఇండియా లోయర్‌ ఆర్డరే మ్యాచ్‌ గమనాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన స్థితిలో వాషింగ్టన్‌ సుందర్‌ (62), శార్దూల్‌ ఠాకూర్‌ (67) అనూహ్య బ్యాటింగ్‌తో టీమ్‌ఇండియా 336 పరుగులు చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ లోయర్‌ ఆర్డరే మళ్లీ జట్టు విజయానికి కీలకమైంది. శుభ్‌మన్‌ 91 పరుగులు చేసినా.. అతడితో సహా రోహిత్‌, రహానె, పుజారా కీలక సమయంలో ఔట్‌ కావడం వల్ల భారత్‌ చాలా ఇబ్బందుల్లో పడింది. కానీ పంత్‌ (89) మరోసారి ఎదురుదాడి చేసి కంగారూల నుంచి మ్యాచ్‌ లాగేసుకున్నాడు. సుందర్‌ (22) మరో కీలక ఇన్నింగ్స్‌తో తన వంతు పాత్ర పోషించాడు. వీళ్లిద్దరి భాగస్వామ్యం వల్లే భారత్‌ సిరీస్‌ను నిలబెట్టుకోగలిగింది.

ఇంగ్లాండ్​లోనూ..

మళ్లీ ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులోనూ లోయర్‌ఆర్డర్‌ అనూహ్య ప్రదర్శన చేసి జట్టు విజయానికి పునాదులు వేసింది. మ్యాచ్‌ అయిదో రోజు షమి, బుమ్రాల తొమ్మిదో వికెట్‌ భాగస్వామ్యం (89).. ఓటమి ముప్పును ఎదుర్కొంటున్న జట్టును గెలుపు బాట పట్టించింది. లోయర్‌ఆర్డర్‌లో రవీంద్ర జడేజా మరో ఎత్తు. గత కొంతకాలంగా ఈ ఆల్‌రౌండర్‌ బ్యాటింగ్‌లో స్థిరంగా రాణిస్తున్నాడు. టాప్‌, మిడిల్‌ఆర్డర్‌లు విఫలమైన సందర్భంలో లోయర్‌ ఆర్డర్‌తో కలిసి జడ్డూ ఆదుకున్న మ్యాచ్‌లు చాలానే ఉన్నాయి.

ఇటీవల ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 205/7తో నిలిచిన స్థితిలో అర్ధసెంచరీతో జట్టు మరీ తక్కువ స్కోరుకే ఆలౌట్‌ కాకుండా అడ్డుపడ్డాడు. బుమ్రా (28)తో కలిసి అతడు జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఇలా కింది వరుస బ్యాట్స్‌మెన్‌ తరచుగా అద్భుత పోరాటం చేస్తూ జట్టు ఆశల్ని నిలబెడుతున్నారు. మరోవైపు ఓపెనర్లూ రాణిస్తున్నారు. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న పుజారా, కోహ్లి, రహానె కూడా వీరి స్ఫూర్తితో నిలకడ అందుకుంటే.. టీమ్‌ఇండియాకు తిరుగుండదు!

ఇదీ చదవండి : 'ఇంగ్లాండ్‌ భయపడిందని అప్పుడే అర్థమైంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.