ETV Bharat / sports

బీసీసీఐపై ఆసీస్​ మహిళా క్రికెటర్ విమర్శలు

టీమ్​ఇండియా క్రికెటర్​ వేదా కృష్ణమూర్తి విషయంలో బీసీసీఐ సరిగా వ్యవహరించలేదని ఆసీస్ క్రికెటర్ స్టాలేకర్ విమర్శించింది. ఇంగ్లాండ్ పర్యటన విషయంలో కనీసం ఆమెతో మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

Veda Krishnamurthy
వేదా కృష్ణమూర్తి
author img

By

Published : May 15, 2021, 5:05 PM IST

బీసీసీఐ తీరుపై ఆస్ట్రేలియా మహిళా మాజీ కెప్టెన్ లీసా స్టాలేకర్ అసంతృప్తి వ్యక్తం చేసింది​. టీమ్ఇండియా మహిళా ప్లేయర్ వేదా కృష్ణమూర్తి పట్ల బోర్డు ఇటీవల వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని ఆరోపించింది. ఈ మధ్యే వేదా తల్లి, సోదరి కరోనా కారణంగా చనిపోయారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్​ పర్యటన కోసం జట్టును ప్రకటించిన బోర్డు.. కృష్ణమూర్తిని ఎంపిక చేయలేదు. ఈ విషయమై ఆమెతో సంప్రదింపులు జరపకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదని లీసా విమర్శించింది.

"ఇంగ్లాండ్​ సిరీస్​ కోసం వేదాను ఎంపిక చేయకపోవడం వాళ్ల దృష్టిలో సరైనదే కావొచ్చు. అయితే ఈ విషయమై ఆమెతో ఒక్కసారి కూడా మాట్లాడకుండా ఇలా చేయడం సరికాదు. కనీసం ఆమె పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందని కూడా ఆరా తీయలేదు!. ఇది నాకెంతో కోపం తెప్పించింది. ఓ నిజమైన అసోసియేషన్​ కేవలం ఆటపైనే కాదూ తమ ఆటగాళ్ల గురించి ఆలోచించాలి. భారత మహిళా జట్టుకు ప్లేయర్స్​ అసోసియేషన్​ ఉండటం కచ్చితంగా అవసరమని అనుకుంటున్నాను"

-లిసా, ఆస్ట్రేలియా మాజీ సారథి

లిసా స్టాలేకర్​.. కెరీర్​లో 8టెస్టులు(416 పరుగులు), 125వన్డేలు(2728), 54టీ20(769)లు ఆడింది. వన్డేల్లో 1000 పరుగులు 100 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్​గా నిలిచింది.

ఇదీ చూడండి: ఇంగ్లాండ్​ పర్యటనకు భారత మహిళల జట్టు ఇదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.