ETV Bharat / sports

ప్రపంచం అంతా ఓవైపు.. టీమ్​ఇండియా మరోవైపు.. క్రికెట్​ మ్యాచ్​ ఎప్పుడంటే?

author img

By

Published : Aug 12, 2022, 4:05 PM IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా.. ఇండియా వర్సెస్​ రెస్ట్ ఆఫ్​ ది వరల్డ్​ మ్యాచ్​కు రంగం సిద్ధమైంది. వచ్చే నెల ఈ మ్యాచ్​ జరగనుంది. ఇండియాకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కెప్టెన్​కు వ్యవహరించనున్నాడు. ప్రతిష్టాత్మక కోల్​కతాలోని ఈడెన్ గార్డెన్స్​​ వేదికగా ఈ మ్యాచ్​ను బీసీసీఐ నిర్వహిస్తోంది.

ఇయాన్ మోర్గాన్​
గంగూలీ

లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ తాజా సీజన్​కు రంగం సిద్ధమైంది. ఓ ప్రత్యేక మ్యాచ్‌తో ఆరంభం కానుంది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఇండియా మహరాజాస్‌, వరల్డ్‌ జెయింట్స్‌ మధ్య మ్యాచ్​తో ఈ లీగ్ ప్రారంభం కానుంది.. కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్‌ గార్డెన్స్‌లో సెప్టెంబరు 16న జరిగే ఈ మ్యాచ్‌లో సుమారు 10 దేశాలకు చెందిన ఆటగాళ్లు భాగం కానున్నారు. ఈ విషయాన్ని ఎల్​ఎల్​సీ కమిషనర్​ రవిశాస్త్రి తెలిపారు.

వాస్తవానికి తొలుత ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​లో భాగంగా టీమ్​ఇండియా.. రెస్టాఫ్​ వరల్డ్​ టీమ్​తో తలపడాల్సి ఉంది. ఆ మ్యాచ్​ తొలుత ఆగస్టు 22న నిర్వహించాలనుకున్నారు. కానీ.. ఇతర బిజీ షెడ్యూల్​ కారణంగా కుదరలేదు. ఇప్పుడు లెజెండ్స్​ లీగ్ క్రికెట్​లో భాగంగానే తొలి మ్యాచ్​లో వరల్డ్​ జెయింట్స్​తో భారత్​ తలపడనుంది. ​

భారత జట్టుకు మాజీ కెప్టెన్​, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సారథిగా వ్యవహరించగా.. వరల్డ్ జెయింట్స్​కు 2019 వరల్డ్​ కప్​ విన్నింగ్​ కెప్టెన్​ ఇయాన్ మోర్గాన్​ సారథిగా ఉండనున్నాడు. కాగా, 17నుంచి యథాతథంగా లెజెండ్స్​ లీగ్ క్రికెట్​ మ్యాచ్​లు కొనసాగనున్నాయి. ఇందులో 3 జట్లు.. 22 రోజుల పాటు 15 మ్యాచ్​లు ఆడనున్నాయి.
భారత జట్టులో గంగూలీతో పాటు వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ వంటి దిగ్గజాలు ఆడనున్నారు. వీళ్లంతా గంగూలీ సారథ్యంలో భారత జట్టుకు ఆడినవారే కావడం విశేషం.

జట్ల వివరాలు:

ఇండియా: గంగూలీ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, యూసgఫ్ పఠాన్, బద్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్, పార్థీవ్ పటేల్ (వికెట్ కీపర్), స్టువర్ట్ బిన్నీ, శ్రీశాంత్, హర్భజన్ సింగ్, నమన్ ఓజా (వికెట్ కీపర్), అశోక్ దిండా, ప్రజ్జాన్ ఓజా, అజయ్ జడేజా, ఆర్పీ సింగ్, జోగిందర్ శర్మ, రితేందర్ సింగ్ సోధి.

వరల్డ్​ జెయింట్స్​: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), లెండిల్​ సిమన్స్, హెర్షెలీ గిబ్స్, జాక్వస్ కలిస్, సనత్ జయసూర్య, మాట్ ప్రియర్ (వికెట్ కీపర్), నాథన్ మెక్ కల్లమ్, జాంటీ రోడ్స్, ముత్తయ్య మురళీధరన్, డేల్ స్టెయిన్, హమిల్టన్ మసకద్జ, మష్రఫా మొర్తజా, అస్గర్ అఫ్ఘాన్, మిచెల్ జాన్సన్, బ్రెట్ లీ, కెవిన్ ఒబ్రెయిన్, దినేశ్ రామ్​దిన్ (వికెట్ కీపర్)

ఇది చూడండి: RakshaBandhan: తోబుట్టువులతో సినీ, క్రీడా తారలు.. సెలబ్రేషన్స్​ సూపర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.