ETV Bharat / sports

లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్​పై కీలక నిర్ణయం.. ఇక్కడే నిర్వహించేలా..

Legends league cricket: లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్​ను భారత్‌లోనే నిర్వహించాలనే నిర్ణయించారు నిర్వాహకులు. త్వరలోనే వేదకలపై స్పష్టత ఇవ్వనున్నారు.

Legends League venue
లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్​
author img

By

Published : Jul 23, 2022, 7:16 PM IST

Legends league cricket: మాజీ క్రికెటర్లు తమలోని సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకునే వేదిక లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్ (ఎల్‌ఎల్‌సీ). ఈ ఏడాది జనవరిలో ఎల్‌ఎల్‌సీ తొలి సెషన్‌ను పూర్తి చేసుకుంది. అదేవిధంగా వచ్చే సెప్టెంబర్‌ 20 నుంచి రెండో విడత పోటీలు ప్రారంభం కానున్నాయి. ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని ఎల్‌ఎల్‌సీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. తొలుత ఒమన్‌ వేదికగా మ్యాచ్‌ల నిర్వహణకు సిద్ధమైన ఎల్‌ఎల్‌సీ.. తాజాగా టోర్నమెంట్‌ను భారత్‌లోనే నిర్వహించాలనే నిర్ణయించింది. మొదటి సీజన్‌ పోటీలు ఒమన్‌ వేదికగా జరిగినప్పటికీ.. భారత్‌ నుంచీ అద్భుత స్పందన వచ్చింది. దీంతో రెండో సెషన్‌ పోటీలను స్వదేశంలోనే నిర్వహించాలని ఎల్‌ఎల్‌స్‌ కమిటీ తీర్మానించింది.

తొమ్మిది దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు పాల్గొనే టోర్నీకి సంబంధించి మైదానాలను ఖరారు చేయాల్సి ఉంది. "భారత్‌లోనే టోర్నమెంట్‌ను నిర్వహించాలనే విజ్ఞప్తులు భారీగా వచ్చాయి. అందుకే ఇక్కడే నిర్వహించాలని భావించాం. స్వదేశానికి టోర్నమెంట్‌ను తీసుకురావడం ఆనందంగా ఉంది. భారత్‌లో అత్యధికంగా క్రికెట్‌ అభిమానులు ఉన్న విషయం తెలిసిందే కదా.. మొదటి సీజన్‌లో వీక్షణలకు సంబంధించి భారత్‌ నుంచే ఎక్కువగా వచ్చాయి. ఆ తర్వాత పాకిస్థాన్‌, శ్రీలంక నుంచీ పెద్ద సంఖ్యలో అభిమానులు మ్యాచ్‌లను వీక్షించారు. అందుకే భారత్‌లోనే నిర్వహించాలనే మా నిర్ణయం అభిమానులను సంతోషపెడుతుందని భావిస్తున్నా" అని లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రామన్‌ రహేజా తెలిపారు. ఇప్పటికే హర్భజన్‌ సింగ్, సెహ్వాగ్‌, ఇయాన్‌ మోర్గాన్, డేల్‌స్టెయిన్‌, జాక్వెస్‌ కలిస్, ఇర్ఫాన్ పఠాన్‌, షేన్ వాట్సన్ తదితరులు రెండో సీజన్‌లో ఆడేందుకు సిద్ధమని ప్రకటించారు

ఇదీ చూడండి: కపై అంపైర్లకు స్పెషల్​ కేటగిరీ.. టాప్‌లో ఎవరున్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.