ETV Bharat / sports

Lasith Malinga: ఐపీఎల్​లో బౌలింగ్ ​కోచ్​గా మలింగ.. ఏ జట్టుకంటే? - రాజస్థాన్ రాయల్స్​

Lasith Malinga: శ్రీలంక మాజీ ఆటగాడు లసిత్​ మలింగను ఫాస్ట్​ బౌలింగ్​ కోచ్​గా నియమించింది రాజస్థాన్ రాయల్స్​. ఈ మేరకు జట్టు యాజమాన్యం సోషల్​ మీడియాలో ప్రకటన చేసింది.

LASITH MALINGA
లసిత్ మలింగ
author img

By

Published : Mar 11, 2022, 3:50 PM IST

ముంబయి ఇండియన్స్​ ఐదుసార్లు కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించిన శ్రీలంక పేసర్​ లసిత్​ మలింగ.. ఐపీఎల్​లో బౌలింగ్​ కోచ్​గా మారనున్నాడు. మలింగను ఫాస్ట్​ బౌలింగ్ కోచ్​గా నియమించుకుంది రాజస్థాన్​ రాయల్స్​. ఈ విషయాన్ని సోషల్​ మీడియా వేదికగా ప్రకటించింది.

LASITH MALINGA
లసిత్ మలింగ

లసిత్​ మలింగకు టీ20 క్రికెట్​లో అద్భుతమైన రికార్డు ఉంది. రాజస్థాన్​ రాయల్స్​కు.. మలింగ సహచరుడు, శ్రీలంక మాజీ కెప్టెన్​ కుమార సంగక్కర డైరెక్టర్​గా వ్యవహరిస్తున్నాడు.

ఐపీఎల్ 2022లో సంజూ శాంసన్​ నేతృత్వంలో బరిలోకి దిగనుంది రాజస్థాన్. జోస్​ బట్లర్​, యశస్వి జైస్వాల్​, దేవ్​దత్ పడిక్కల్​, హెట్​మైయర్​లతో టాప్​ ఆర్డర్​ దృఢంగా ఉంది. ట్రెంట్​ బౌల్ట్​, నవదీప్ షైని, ప్రసిద్ధ్ కృష్ణలతో బౌలింగ్​ లైనప్ కూడా​ పటిష్టంగా కనపడుతుంది. మార్చి 26న ఈ సీజన్ మొదలుకానుంది.

ఇదీ చదవండి:IPL 2022: వీరి ఆట చూసి తీరాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.