టీ20 ప్రపంచకప్(t20 worldcup 2021)లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక(sri vs ban t20) విజయం సాధించింది. ఈ మ్యాచ్ సమయంలో గొడవకు దిగిన లంక ఆటగాడు లహిరు కుమార, బంగ్లాదేశ్ ప్లేయర్ లిటన్ దాస్(lahiru kumara vs liton das)కు జరిమానా విధించింది ఐసీసీ. నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్నందుకు ఫైన్ విధిస్తున్నట్లు పేర్కొంది.
కుమార జీతం నుంచి 25 శాతం, లిట్టన్ దాస్(lahiru kumara vs liton das)కు 15 శాతం జరిమానాతో పాటు ఓ డీమెరిట్ పాయింట్‌ను విధించింది ఐసీసీ. మైదానంలో వారు వాడిన భాష, బాడీలాంగ్వేజ్ సరిగా లేదంటూ ఈ జరిమానా విధించింది. ఈ విషయంలో వీరిద్దరూ తమ తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరడం వల్ల.. విచారణ ఉండదని తెలిపారు ఐసీసీ మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్.
-
Lahiru Kumara fined 25% of his match fee & received 1 demerit point, while Liton Das of Bangladesh fined 15% of his match fee & received 1 demerit point for breaching ICC Code of Conduct in yesterday's Match #BANvSL #LKA #SriLanka #T20WorldCup pic.twitter.com/JPbSoFj8xI
— Sri Lanka Tweet 🇱🇰 💉 (@SriLankaTweet) October 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Lahiru Kumara fined 25% of his match fee & received 1 demerit point, while Liton Das of Bangladesh fined 15% of his match fee & received 1 demerit point for breaching ICC Code of Conduct in yesterday's Match #BANvSL #LKA #SriLanka #T20WorldCup pic.twitter.com/JPbSoFj8xI
— Sri Lanka Tweet 🇱🇰 💉 (@SriLankaTweet) October 25, 2021Lahiru Kumara fined 25% of his match fee & received 1 demerit point, while Liton Das of Bangladesh fined 15% of his match fee & received 1 demerit point for breaching ICC Code of Conduct in yesterday's Match #BANvSL #LKA #SriLanka #T20WorldCup pic.twitter.com/JPbSoFj8xI
— Sri Lanka Tweet 🇱🇰 💉 (@SriLankaTweet) October 25, 2021
ఏం జరిగింది?
బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆరో ఓవర్లో లిటన్ దాస్‌ను ఔట్ చేశాడు లహిరు కుమార. అతడిని ఔట్ చేశాక.. దాస్ దగ్గరకు వెళ్లిన కుమార కొన్ని మాటలు అన్నాడు. దాస్ కూడా కోపంతో అతడి మీదకు వెళ్లాడు. అంపైర్లు కలగజేసుకుని వారికి సర్దిచెప్పారు.
ఈ మ్యాచ్‌లో లంక 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. బంగ్లా విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని మరో ఏడు బంతులు మిగిలుండగానే ఛేదించింది. చరిత్ అసలనక, భానుక రాజపక్సా అర్ధసెంచరీలతో అలరించారు.