ETV Bharat / sports

శ్రీలంక వన్డే జట్టులో మార్పులు.. కెప్టెన్​గా పెరీరా! - దిముత్ కరుణరత్నేకు మొండిచేయి

శ్రీలంక వన్డే జట్టును ప్రక్షాళన చేయాలని చూస్తోందట లంక క్రికెట్ బోర్డు. ఇందులో భాగంగా వన్డేలకు కెప్టెన్​గా ఉన్న కరుణరత్నేను ఈ బాధ్యతల నుంచి తప్పించనుందని తెలుస్తోంది.

Kusal Perera
పెరీరా
author img

By

Published : May 7, 2021, 9:39 PM IST

జట్టులో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది శ్రీలంక క్రికెట్ బోర్డు. వెస్టిండీస్​తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్​లో ఓటమి చెందిన లంక జట్టును ప్రక్షాళన చేసేందుకు సన్నద్ధమైంది. పూర్తిగా యువ జట్టును తీసుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం వన్డే జట్టుకు కెప్టెన్​గా ఉన్న దిముత్ కరుణరత్నేను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని భావిస్తోంది. ఇతడి స్థానంలో కుశాల్ పెరీరాకు సారథ్య బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన చేయనున్నారు.

అలాగే మాథ్యూస్, దినేష్ చండీమల్, కరుణరత్నే, లహిరు తిరమన్నే వంటి ఆటగాళ్లను పక్కన పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సీనియర్ ఆల్​రౌండర్ తిసర పెరీర్​ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో బోర్డు నిర్ణయంతో వీరు కూడా అదే బాటలో నడిచే వీలుందని తెలుస్తోంది.

ప్రస్తుతం టెస్టు, వన్డే జట్టుకు కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు కరుణరత్నే. అందులో వన్డేల నుంచి ఇతడిని తప్పించి 30 ఏళ్ల కుశాల్ పెరీరాకు సారథ్యం ఇవ్వాలని చూస్తోందట. అలాగే 26 ఏళ్ల కుశాల్ మెండిస్​కు వైస్ కెప్టెన్​ అవకాశం ఇవ్వొచ్చని వార్తలు వస్తున్నాయి. టీ20 జట్టు, కెప్టెన్సీలో ఎలాంటి మార్పులు ఉండయని సమాచారం. ప్రస్తుతం దసున్ శనక పొట్టి ఫార్మాట్​కు కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.