కోల్‌కతా నైట్‌రైడర్స్ సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐపీఎల్ 2021(kuldeep yadav ipl 2021)కు పూర్తిగా దూరమయ్యాడు. ప్రాక్టీస్ సమయంలో మోకాలికి గాయం(kuldeep yadav injury) కావడం వల్ల ఇతడు టోర్నీ నుంచి వైదొలిగాడు. గాయం కాస్త పెద్దది కావడం వల్ల అతడు దాదాపు 4-6 నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. ఈ సమయంలో జాతీయ శిక్షణ శిబరంలో ఇతడు కోలుకోనున్నాడు.
ఇదే విషయంపై ఓ బీసీసీఐ అధికారి స్పందిస్తూ.. "యూఏఈలో ప్రాక్టీస్ సమయంలో కుల్దీప్ కాలు తీవ్రంగా ఫ్రాక్చర్ అయిందని మాకు సమాచారం అందింది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతడి కాలు మెలిక పడింది. అతడు స్వదేశానికి రానున్నాడు" అని తెలిపారు.
అయితే ఇటీవలే కుల్దీప్కు మోకాలి సర్జరీ(kuldeep yadav injury) అయిందని తెలుస్తోంది. దీంతో అతడు దేశవాళీ క్రికెట్‌కూ దూరం కానున్నాడని సమాచారం. "మోకాలి గాయం(kuldeep yadav injury) అనేది చాలా కష్టమైంది. దీని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఎన్సీఏలో దీర్ఘకాల ఫిజియోథెరపీకి హాజరు కావాల్సి ఉంటుంది" అని ఓ అధికారి వెల్లడించారు.
ఐపీఎల్లో కోల్‌కతాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కుల్దీప్కు అవకాశాలు మాత్రం రావట్లేదు. రెండు సీజన్లుగా అతడిని తుది జట్టులోకి తీసుకోవడం లేదు. దీనిపై చాలాసార్లు అసంతృప్తిని వ్యక్తం చేశాడీ స్పిన్నర్.