krunal pandya twitter hacked: టీమ్ఇండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. బిట్‌కాయిన్స్ కోసం ఈ అకౌంట్‌ను అమ్మేయబోతున్నట్లు హ్యాకర్.. పాండ్య అకౌంట్ నుంచి ట్వీట్ చేశాడు. ఉదయం నుంచి ఈ ఖాతా ద్వారా దాదాపు పది ట్వీట్లు చేశాడు. దీనిపై ఓ నెటిజన్ స్పందించగా.. అతడి క్రిప్టోకరెన్సీ పంపాల్సిందిగా హ్యాకర్ కోరాడు. ఈ విషయాన్ని గుర్తించిన కృనాల్.. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశాడు.
క్రికెటర్ల సోషల్‌మీడియా ఖాతాలు హ్యాకింగ్‌కు గురికావడం ఇదేం తొలిసారి కాదు. 2019లో ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ ఇన్‌స్టా, 2021లో భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ ఇన్‌స్టా కూడా హ్యాక్ అయింది. అప్పుడు.. ఆ అకౌంట్ నుంచి వచ్చిన పోస్టింగ్స్‌ను నమ్మొద్దని వారు నెటిజన్లను సూచించారు.
ఇదీ చూడండి:
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!