Krunal Pandya Quits Baroda Captaincy: బరోనా కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు టీమ్ఇండియా ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా(krunal pandya latest news) ఈ విషయాన్ని బరోడా క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. కానీ ఇందుకు గల కారణం మాత్రం అతడు తెలపలేదని స్పష్టం చేసింది యాజమాన్యం. త్వరలోనే కొత్త కెప్టెన్ ఎవరనే విషయాన్ని వెల్లడిస్తామని పేర్కొంది.
కృనాల్ స్థానంలో కొత్త కెప్టెన్గా కేదార్ దేవధర్ ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే నెలలో జరగబోయే విజయ్ హజారే ట్రోఫీ ముందు ఇతడికి సారథ్య బాధ్యతలు అప్పగించే వీలుంది.
ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గ్రూప్-బిలో 4 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచింది బరోడా. ఈ టోర్నీలో 4 మ్యాచ్ల్లో ఓడిన ఈ జట్టు ఒక్క విజయం మాత్రమే సాధించగలిగింది.
కృనాల్తో గొడవ కారణంగా బరోడా జట్టు నుంచి తప్పుకొన్నాడు దీపక్ హుడా. ఈ విషయం ఆ మధ్య చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం దీపక్ రాజస్థాన్ జట్టుకు ఆడుతున్నాడు.