ETV Bharat / sports

Kohli ODI Captaincy: కోహ్లీ.. వన్డే కెప్టెన్సీ నుంచి కూడా! - kohli captaincy

టీ20 ప్రపంచకప్​ (T20 World Cup 2021) తర్వాత న్యూజిలాండ్​తో సిరీస్​కు జట్టు ఎంపికపై చర్చించేందుకు బీసీసీఐ త్వరలోనే సమావేశం కానుంది. ఈ భేటీలో టీ20 కెప్టెన్​గా రోహిత్​ శర్మను (Rohit Sharma News) ఎంపిక చేయనున్నట్లు సమాచారం. వన్డేల్లో విరాట్​ కోహ్లీ కెప్టెన్సీ (Virat Kohli ODI Captain) భవితవ్యంపైనా భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Virat Kohli ODI Captain
విరాట్​ కోహ్లీ
author img

By

Published : Nov 2, 2021, 6:14 PM IST

న్యూజిలాండ్​తో (New Zealand Series of India) నవంబర్​ 17 నుంచి జరగబోయే 3 టీ20లకు రోహిత్ శర్మ (Rohit Sharma News) సారథ్యం వహించే అవకాశం ఉంది. మరోవైపు విరాట్​ కోహ్లీ వన్డే కెప్టెన్సీ (Virat Kohli ODI Captain) భవితవ్యంపై బీసీసీఐ అధినాయకత్వం మరికొన్ని రోజుల్లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీ20 కెప్టెన్సీ బాధ్యతలను వదులుకున్న కోహ్లీ.. వన్డే పగ్గాలను కోల్పోయే ప్రమాదముంది.

ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకోవడంలో మరోసారి విఫలమైతే సారథిగా కోహ్లీ కొనసాగడం కష్టమే. కొద్దిరోజుల్లో జాతీయ సెలక్టర్లతో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా జరపనున్న వర్చువల్​ సమావేశంలో నాయకత్వ మార్పు (BCCI on Virat Kohli Captaincy) అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది టీమ్​ఇండియా ఆడాల్సిన వన్డే మ్యాచ్​లు లేవు. వచ్చే సంవత్సరం ఆస్ట్రేలియాలో మరో టీ20 ప్రపంచకప్​ (T20 World Cup 2022 Host) జరగనున్న వేళ ఆ ఏడాది కూడా చాలా కొద్ది వన్డేలు మాత్రమే ఆడనుంది.

ఇదీ చూడండి: కోహ్లీ కెప్టెన్సీ తొలగింపుపై పుకార్లు.. బీసీసీఐ ఏమందంటే!

"తొలుత న్యూజిలాండ్​తో సిరీస్​కు టీమ్​ఇండియా స్క్వాడ్​ను ఎంపిక చేయాల్సి ఉంది. టీ20 పగ్గాలు వద్దని రోహిత్ చెప్పలేదు. పూర్తి స్థాయి టీ20 కెప్టెన్​గా అతడికిదే తొలి సిరీస్​ కానుంది."

- బీసీసీఐ అధికారి

న్యూజిలాండ్​తో నవంబర్​ 17, 19, 21 తేదీల్లో స్వదేశంలో మూడు టీ20లు ఆడనుంది టీమ్​ఇండియా. అనంతరం నవంబర్​ 25-29 మధ్యలో తొలి టెస్టు, డిసెంబర్ 3-7 మధ్య రెండో టెస్టు జరగనుంది.

రోహిత్​ సహా పలువురు సీనియర్​ క్రికెటర్లకు టెస్టుల నుంచి తప్పించి విరామం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టీ20లకు విశ్రాంతి తీసుకున్నవారిని తిరిగి టెస్టులకు ఆడించనున్నట్లు సమాచారం. కివీస్​తో సిరీస్​ అనంతరం డిసెంబర్​ చివర్లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది టీమ్​ఇండియా.

ఇదీ చూడండి: Virat Kohli Captaincy: కోహ్లీ.. వన్డేల్లోనూ కెప్టెన్​గా తప్పుకోవాలన్న శాస్త్రి!

కోహ్లీ.. వన్డేల నుంచీ?

ఫిబ్రవరిలో వెస్టిండీస్​.. భారత్​ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్​లో మాత్రమే టీమ్​ఇండియా మూడు వన్డేలు ఆడనుంది. మరోవైపు 2023 ప్రపంచకప్​ (2023 Cricket World Cup) కోసం బీసీసీఐ రెండేళ్ల మాస్టర్​ప్లాన్​ కోసం తీవ్రంగా కృషిచేస్తోంది.

వచ్చే ఏడాది జూన్ వరకు 17 టీ20లు సహా మూడు వన్డేలు జరగనున్నాయి. వన్డేల్లో ఇప్పటికిప్పుడు కొత్త కెప్టెన్​ను (Virat Kohli Captaincy News) ప్రకటించాలనే ఆత్రుత లేనప్పటికీ.. కేవలం మూడు వన్డేల కోసం ప్రత్యేకంగా వైట్​బాల్​ కెప్టెన్​ ఎందుకని బీసీసీఐ భావించే అవకాశం ఉంది.

అంతకుముందే జరగనున్న దక్షిణాఫ్రికా పర్యటనలో కోహ్లీనే స్వయంగా కెప్టెన్సీ (Virat Kohli ODI Captaincy News) బాధ్యతల నుంచి తప్పుకొంటాడా, లేదా బీసీసీఐ సూచించే వరకు వేచిచూస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఎలా చూసుకున్నా.. వన్డేల సారథిగా కోహ్లీ ఎక్కువ రోజులు ఉండకపోవచ్చని తెలుస్తోంది.

ఇదీ చూడండి: Kohli Captaincy: కోహ్లీ నిర్ణయం వెనుక కారణాలేంటో?

హార్దిక్​, భువీ ఔట్?

వచ్చే టీ20 ప్రపంచకప్​కు (T20 World Cup 2022) సరిగ్గా 11 నెలల సమయముంది. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువ మంది క్రికెటర్లను పరిశీలించనుంది సెలక్షన్ కమిటీ. ఫామ్​లో లేని భువనేశ్వర్​ కుమార్, ఫిట్​నెస్​ సమస్యలు ఎదుర్కొంటున్న హార్దిక్​ పాండ్యను న్యూజిలాండ్​ సిరీస్​కు (New Zealand Tour of India) ఎంపిక చేయకపోవచ్చు.

మహ్మద్ షమీ, జస్ప్రీత్​ బుమ్రా లాంటి వరకు విశ్రాంతి తప్పనిసరి అయిన వేళ ఐపీఎల్​లో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్, అవేశ్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్ వంటివారిని జట్టులోకి (Ind Vs Nz Squad) తీసుకునే అవకాశం ఉంది. పాండ్యకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న ఆల్​రౌండర్​ వెంకటేశ్ అయ్యర్​కు పిలుపు రావొచ్చు. టీ20 ప్రపంచకప్​ ఆస్ట్రేలియాలోని బౌన్సీ పిచ్​లపై జరగనున్న నేపథ్యంలో జమ్ముకశ్మీర్ పేస్ సంచనం ఉమ్రామ్​ మాలిక్​ను తీసుకునే అవకాశమూ ఉంది.

అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, దీపక్​ చాహర్​ వంటివారిని టీ20 సిరీస్​కు, శుభ్​మన్ గిల్, మయాంక్ అగర్వాల్, ఉమేశ్ యాదవ్ లాంటివారిని టెస్టులకు ఎంపిక చేసే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: Virat Kohli News: 'కోహ్లీ ఇంకొంత కాలం వేచి చూడాల్సింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.