ETV Bharat / sports

కొత్త ఏడాదిలో కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు ఇవే! - Kohli Records In 2024

Kohli Records To Break In 2024 : టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 2023లో అదరగొట్టాడు. వన్డేల్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్​ను తెందూల్కర్ అత్యధిక సెంచరీల రికార్డును సైతం అధిగమించాడు. 2024లోనూ అదే ఫామ్​ కొనసాగించాలనుకుంటున్న విరాట్​ను ఊరిస్తున్న రికార్డులు ఇవే!

Kohli Records To Break In 2024
Kohli Records To Break In 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 1, 2024, 8:34 PM IST

Kohli Records To Break In 2024 : టీమ్ఇండియా స్టార్‌ ప్లేయర్ విరాట్ కోహ్లీ 2023లో అద్భుత ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా వన్డే వరల్డ్​కప్‌లో అదరగొట్టాడు. 765 పరుగులతో టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్​గా నిలిచాడు. అదే టోర్నీలో సచిన్‌ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల (వన్డేల్లో) రికార్డును బ్రేక్ చేశాడు. 2023లో కోహ్లీ మూడు ఫార్మాట్లలో కలిపి 35 మ్యాచ్‌లు ఆడి 2048 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 10 అర్ధ శతకాలు ఉన్నాయి. 2024లోనూ 'కింగ్' కోహ్లీ ఇదే ఫామ్‌ను కొనసాగించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కొత్త ఏడాది వికాట్​ కోహ్లీ కొన్ని రికార్డులను బ్రేక్ చేసే అవకాశముంది.

2024లో విరాట్​ను ఊరిస్తున్న రికార్డులు

  • వన్డేల్లో అత్యంత వేగంగా 14,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా అవతరించడానికి విరాట్ కోహ్లీ కేవలం 152 పరుగుల దూరంలో ఉన్నాడు. క్రికెట్ గాడ్ సచిన్ తెందూల్కర్ 350 మ్యాచ్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటివరకు 292 వన్డేలు ఆడిన విరాట్ 14 వేల పరుగుల దగ్గరికి వచ్చాడు.
  • కోహ్లీ మరో 35 పరుగులు చేస్తే టీ20ల్లో 12000 పరుగులు పూర్తి చేసిన మొదటి టీమ్ఇండియా ప్లేయర్​గా రికార్డు సృష్టిస్తాడు. వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్ గేల్ (14,562), షోయబ్ మాలిక్ (12,993), కిరన్ పొలార్డ్ (12,390) పరుగులతో విరాట్ కంటే ముందున్నారు.
  • ఐదు టెస్టుల సిరీస్ కోసం​ ఇంగ్లాండ్ జనవరిలో భారత్​లో పర్యటించనుంది. ఈ సిరీస్‌లో విరాట్ రాణించి 544 పరుగులు చేస్తే, సచిన్ (2,535 పరుగులు)ని అధిగమిస్తాడు. దీంతో టెస్టుల్లో ఇంగ్లాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్​గా నిలుస్తాడు.
  • విరాట్ మరో 21 పరుగులు చేస్తే అన్ని ఫార్మాట్లలో ఇంగ్లాండ్‌పై అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. కోహ్లీ మరో 30 పరుగులు చేస్తే ఇంగ్లాండ్‌పై ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 4,000 పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలుస్తాడు.
  • కింగ్ కోహ్లీ మరో శతకం సాధిస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం విరాట్, సచిన్ తొమ్మిదేసి సెంచరీలతో సమంగా ఉన్నారు.
  • విరాట్ టెస్టుల్లో బంగ్లాదేశ్‌పై మరో 383 పరుగులు చేస్తే సచిన్ (820 పరుగులు)ను అధిగమించి భారత్ తరఫున అత్యధిక పరుగులు బాదిన ప్లేయర్​గా అవతరిస్తాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.