Virat Kohli 100th test: రెండేళ్లుగా విరాట్ కోహ్లీ సెంచరీ కోసం నిరీక్షిస్తున్న అభిమానులకు మళ్లీ నిరాశే మిగిలింది. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో అతడు 45 పరుగలకే వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్ 44వ ఓవర్లో లంక స్పిన్నర్ ఎంబుల్దేనియా వేసిన బంతికి క్లీక్ బౌల్డ్‌గా వెనుదరిగాడు.
8వేల పరుగుల మైలురాయి..
దీంతో విరాట్ చారిత్రక ఇన్నింగ్స్ చూసేందుకు స్టేడియానికి వచ్చిన అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. అయితే ఈ మ్యాచ్‌లో 8000 పరుగులు మైలురాయిని మాత్రం కోహ్లీ అధిగమించాడు. 38 పరగుల వద్ద ఈ రికార్డును చేరుకున్నాడు.
ఇక టీ విరామానికి టీమ్ఇండియా 4 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. క్రీజులో రిషభ్ పంత్ (12*), శ్రేయస్ అయ్యర్ (14*) ఉన్నారు. కోహ్లీ ఔటైన కాసేపటికే విహారి (58) కూడా ఫెర్నాండో బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
శ్రీలంక బౌలర్లలో ఎంబుల్దేనియా 2 వికెట్లు, లహిరు కుమార, ఫెర్నాండో తలో వికెట్ పడగొట్టారు.
ఇదీ చూడండి: వందో టెస్టులో కోహ్లీ భావోద్వేగం.. ద్రవిడ్ స్పెషల్ గిఫ్ట్