Kohli Naveen Ul Haq : వన్డే ప్రపంచకప్-2023లో టీమ్ ఇండియా తమ జోరును కొనసాగిస్తోంది. ఈ టోర్నీలో భాగంగా రీసెంట్గా ఆస్ట్రేలియాపై గెలిచిన భారత జట్టు.. తాజాగా దిల్లీ వేదికగా ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆఫ్గానిస్థాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ కలిసిపోయారు. మ్యాచ్ మధ్యలో ఒకరినొకరు కౌగిలించుకుని తమ మధ్య ఉన్న వైరానికి ఫుల్‌స్టాప్ పెట్టారు! కాగా, ఐపీఎల్-2023లో ఆర్సీబీ వర్సెస్ లఖ్‌నవూ మ్యాచ్‌లో నవీన్ ఉల్ హక్‌కు విరాట్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే.
ODI World Cup 2023 IND VS Afghanisthan : దీంతో కోహ్లీ అభిమానులు.. నవీన్ ఎక్కడ కనిపించిన కోహ్లీ కోహ్లీ అంటూ అరుస్తూ అతడిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ ప్రపంచకప్‌లోనూ 'కోహ్లీ కోహ్లి' నినాదాలతో స్టేడియం దద్దరిల్లిపోయాయి. తాజాగా ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ, నవీన్‌కు మధ్య మంచి పోటీ ఉంటుందని అంతా ఆశించారు. సోషల్ మీడియాలో కోహ్లీ వర్సెస్ నవీన్ ఉల్ హక్ అంటూ ట్రెండ్ కూడా చేశారు. విరాట్ కూడా నవీన్‌ను టార్గెట్ చేస్తాడని అంతా భావించారు. కానీ తీరా చూస్తే అదేమి జరగలేదు. అందరి ఊహలను తలకిందలు చేస్తూ ఇద్దరూ క్రీడా స్పూర్తిని ప్రదర్శించారు. ఒకరినొకరు ఆప్యాయంగా మాట్లాడుకుంటూ అలింగనం కూడా చేసుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు షాక్ అండ్ సర్ప్రైజ్ అవుతూ తెగ కామెంట్లు పెడుతున్నారు
ఇకపోతే ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 84 బంతుల్లో 16x4, 5x6 సాయంతో విధ్వంసకర శతకం(131)తో చెలరేగాడు. దీంతో 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా 35 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అప్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ వికెట్లు తీశాడు.
-
#INDvsAFG #ViratKohli𓃵 #CricketTwitter
— movie enthusiast (@OKAYCHILL07) October 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
So it's finally over 🫂 naveen vs kohli pic.twitter.com/EUC96FjWbk
">#INDvsAFG #ViratKohli𓃵 #CricketTwitter
— movie enthusiast (@OKAYCHILL07) October 11, 2023
So it's finally over 🫂 naveen vs kohli pic.twitter.com/EUC96FjWbk#INDvsAFG #ViratKohli𓃵 #CricketTwitter
— movie enthusiast (@OKAYCHILL07) October 11, 2023
So it's finally over 🫂 naveen vs kohli pic.twitter.com/EUC96FjWbk
Ind VS Pak World Cup 2023 : ఏంటి.. వరల్డ్ కప్‌కు ముందు ఇద్దరు పాక్ ప్లేయర్లే ఇండియాకు వచ్చారా?
ODI World Cup 2023 IND VS AFG : రోహిత్ సెన్సేషనల్ సెంచరీ... టీమ్ఇండియా వరుసగా రెండో విజయం