ETV Bharat / sports

'కోహ్లీ గొప్ప బ్యాట్స్​మన్​.. అతనితో పోలిక గర్వకారణం' - బాబర్​ అజామ్​ లేటెస్ట్​ న్యూస్​

టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ లాంటి గొప్ప బ్యాట్స్​మన్​తో తనను పోల్చడం గర్వంగా ఉందని అంటున్నాడు పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​. తామిద్దరి బ్యాటింగ్ శైలీ వేరైనా అభిమానులు కోహ్లీతో పోలిక చూపడం చాలా ఆనందంగా ఉందని ఓ ఇంటర్వ్యులో వెల్లడించాడు.

Kohli is one of the best players, I feel proud when people compare us: Babar Azam
'కోహ్లీ గొప్ప బ్యాట్స్​మన్​.. అతనితో పోలిక గర్వకారణం'
author img

By

Published : Jun 3, 2021, 2:00 PM IST

Updated : Jun 3, 2021, 2:18 PM IST

ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్​మెన్​లో ఒకడైన విరాట్​ కోహ్లీతో తనను పోల్చడం పట్ల చాలా ఆనందంగా ఉందని పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​ అన్నాడు. కోహ్లీ లాంటి అద్భుతమైన బ్యాట్స్​మన్​తో తన ఆటను పోల్చడం పట్ల గర్వంగా భావిస్తున్నట్లు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

"ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లులో విరాట్​ కోహ్లీ ఒకరు. ప్రతి మ్యాచ్​లోనూ అతడు ఉత్తమంగా రాణిస్తాడు. అయితే క్రికెట్​ అభిమానులు ఎప్పుడైతే మా ఇద్దరి పోల్చినప్పుడు నాపై ఒత్తిడి పెరగదు. ఎందుకంటే కోహ్లీ లాంటి గొప్ప ఆటగాడితో నన్ను పోల్చుకోవడాన్ని గర్వంగా భావిస్తా. వ్యక్తిగతంగా మరో ఆటగాడితో నన్ను పోల్చుకోవడం నాకు నచ్చదు. కానీ, అభిమానులు కోహ్లీతో పోలుస్తుంటే నాకు సంతోషంగా ఉంది. కోహ్లీని నన్ను వేర్వేరుగా చూస్తే ఎవరి బ్యాటింగ్​ స్టైల్​ వారికి ఉంటుంది. కాబట్టి బ్యాటింగ్​లో గొప్పగా రాణించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా".

- బాబర్​ అజామ్​, పాకిస్థాన్​ టీమ్​ కెప్టెన్​

ఇటీవలే ఐసీసీ విడుదల చేసిన వన్డే బ్యాట్స్​మెన్​ ర్యాంకింగ్స్​లో బాబర్​ అజామ్​ అగ్రస్థానానికి చేరాడు. జులై 8 నుంచి ఇంగ్లాండ్​తో ఆడనున్న సిరీస్​ 3 వన్డేలు, 3టీ20ల్లో పాకిస్థాన్​ జట్టు తలపడనుంది. ఈ పర్యటన తర్వాత వెస్టిండీస్​తో సిరీస్​లో భాగంగా 5 టీ20లు, 2 టెస్టు మ్యాచ్​లను ఆడనుంది.

ఇదీ చూడండి: గంగూలీ రికార్డును బ్రేక్​ చేసిన కివీస్​ ఓపెనర్​

Last Updated : Jun 3, 2021, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.