ETV Bharat / sports

'కోహ్లీది గొప్ప మనసు.. ఓటమిని హుందాగా అంగీకరించాడు'

టీ20 ప్రపంచకప్​లో(T20 world cup 2021 latest news) భాగంగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో​ ఓటమిని టీమ్​ఇండియా సారథి కోహ్లీ హుందాగా అంగీకరించాడని చెప్పింది పాక్​ మహిళా క్రికెట్​ జట్టు మాజీ కెప్టెన్ సనా మీర్​. విరాట్​ గొప్ప ఆటగాడని కితాబిచ్చింది.

Team India captain Virat Kohli
టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ
author img

By

Published : Oct 26, 2021, 12:58 PM IST

టీ20 ప్రపంచకప్​లో భాగంగా పాక్​తో జరిగిన మ్యాచ్​లో(T20 world cup 2021 latest news) భారత్​ పరాజయం చెందడం వల్ల టీమ్​ఇండియాపై విమర్శలు వస్తున్నాయి. అయితే కొందరు.. ఆటలో గెలుపోటములు సహజమని సమర్థిస్తున్నారు. ఈ క్రమంలో భారత్​ జట్టు సారథి కోహ్లీ కెప్టెన్సీపై(Virat Kohli captaincy news) ప్రశంసలు కురిపించింది పాక్​ మహిళా క్రికెట్​ జట్టు​ మాజీ కెప్టెన్​​ సనా మీర్​. విరాట్​ది(Virat Kohli news) గొప్ప మనసని, ఓటమిని హుందాగా అంగీకరించి ఆదర్శంగా నిలిచాడని కొనియాడింది.

పాకిస్థాన్​తో మ్యాచ్​ ముగిశాక రిజ్వాన్​, బాబర్​ల ఆటతీరును ప్రశంసిస్తూ వారిని హత్తుకున్నాడు. షేక్​ హ్యాండ్​ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే సనా ఈ వ్యాఖ్యలు చేసింది.

"విరాట్ కోహ్లి చాలా హుందాగా ఓటమిని అంగీకరించాడు. అతడి క్రీడాస్ఫూర్తిని నేను అభినందిస్తున్నాను. రోల్ మోడల్స్, అగ్రశ్రేణి ఆటగాడు అయిన అతడు.. ప్రత్యర్థి ఆటగాళ్లను హగ్​ చేసుకుని అభినందించడం నిజంగా చాలా బాగుంది. ఇది తనలోని ఆత్మవిశ్వాసానికి నిదర్శనం" అని సనా పేర్కొంది.

ఈ టోర్నిలో టీమ్ఇండియా తిరిగి పుంజుకుని భారీ విజయాలను అందుకుంటుందని సనా ఆశాభావం వ్యక్తం చేసింది. భారత్​-పాక్(T20 world cup 2021 Pak vs India) మళ్లీ తలపడతాయని తాను ఆశిస్తున్నట్లు చెప్పింది.

ఆదివారం(అక్టోబర్​ 24) భారత్​-పాక్​ మధ్య జరిగిన మ్యాచ్​లో(India vs Pakistan match latest news) పది వికెట్ల తేడాతో దాయాది జట్టు గెలుపొందింది. టీ20 ప్రపంచకప్​ చరిత్రలోనే భారత్​పై తొలిసారి విజయాన్ని అందుకుంది.

ఇదీ చూడండి: IND VS PAK: పాక్ ఆటగాడికి కెప్టెన్ కోహ్లీ హగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.