ETV Bharat / sports

సామ్​ 'ఊ అంటావా మావ' సాంగ్​కు కోహ్లీ చిందులు - ఊ అంటావా మావ సాంగ్​ కోహ్లీ చిందులు

Kohli O antava mava song: ఆర్సీబీ ప్లేయర్​, టీమ్​ఇండియా మాజీ సారథి కోహ్లీ.. 'పుష్ప' చిత్రంలోని 'ఊ అంటావా మావ' సాంగ్​కు చిందులేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది.

Kohli Dance for pushpa samantha O antava mava song
ఊ అంటావా మావ సాంగ్​కు కోహ్లీ చిందులు
author img

By

Published : Apr 28, 2022, 1:54 PM IST

Kohli O antava mava song: సుకుమార్​ దర్శకత్వంలో అల్లుఅర్జున్​ హీరోగా వచ్చిన 'పుష్ప' దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బన్నీ గెటప్​, నటన, సాంగ్స్​ సినిమాకు హైలైట్​గా నిలిచాయి. ముఖ్యంగా సమంత చిందులేసిన 'ఊ అంటావా మావ' సాంగ్​ అయితే శ్రోతలను ఉర్రూతలూగించింది. ఎక్కడ చూసిన ఇదే పాట వినిపించింది. సోషల్​మీడియాలో రికార్డులు సృష్టించింది. సినీప్రియులు అంతా ఈ సాంగ్​కు రీల్స్​ చేసి సోషల్​మీడియాను హోరెత్తించారు. అయితే తాజాగా ఆ పాటకు టీమ్​ఇండియా మాజీ కోహ్లీ కూడా స్టెప్పులేసి నెటిజన్లను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది.

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు.. తమ జట్టు స్టార్​ ఆల్​రౌండర్​, కొత్త పెళ్లి కొడుకు గ్లెన్​ మ్యాక్స్​వెల్​ కోసం గ్రాండ్​ పార్టీ ఏర్పాటు చేసింది. భారత మూలాలున్న వినీ రామన్​ను పెళ్లాడి మాక్సీ తమిళనాడు అల్లుడైయ్యాడు. వీరి విహాహం జరిగి నెల రోజులు పూర్తైన సందర్భంగా ఈ పార్టీ నిర్వహించింది ఫ్రాంచైజీ. బయోబబుల్​లో నిర్వహించిన ఈ వేడుకకు కోహ్లీ తన సతీమణితో కలిసి హాజరయ్యాడు. ఇందులో ఆటగాళ్లతో కలిసి సరదాగా ఎంజాయ్​ చేసిన విరాట్​.. వారితో కలిసి 'ఊ అంటావా' పాటకు చిందులేసి అభిమానుల్ని ఆకట్టుకున్నాడు.

కాగా, ఐపీఎల్​ 2022లో ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచుల్లో ఐదింటిలో విజయం సాధించింది ఆర్సీబీ. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. కోహ్లీ మాత్రం ఇప్పటికి అతని స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ఇబ్బంది పడుతున్నాడు.

ఇదీ చూడండి: ఐపీఎల్​.. నాకు చాలా భయమేస్తోంది: హార్దిక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.