ETV Bharat / sports

T20 worldcup: రోహిత్​పై కోహ్లీ కామెంట్స్​.. ఆ విషయంలో ఇద్దరు ఒకటేనంటూ..

author img

By

Published : Oct 22, 2022, 10:38 PM IST

రోహిత్​శర్మ సహా పాకిస్థాన్​తో మ్యాచ్​ జరిగే విషయంపై కామెంట్స్​ చేశాడు స్టార్ బ్యాటర్ కోహ్లీ. ఏమన్నాడంటే..

kohli comments on rohith
రోహిత్​పై కోహ్లీ కామెంట్స్​

రోహిత్ శర్మకి తనకు ఆటకు సంబంధించిన విషయాల్లో చాలా దగ్గర పోలికలు ఉన్నాయని కోహ్లీ అన్నాడు. లోపాలను అధిగమించి జట్టును విజయపథంలో నడిపించేందుకు తామిద్దరు ప్రయత్నిస్తామని చెప్పాడు. అలాగే పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అంటే తనకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో వివరించాడు.

"పెద్ద టోర్నమెంట్లలో ఎలా విజయం సాధించాలనే అంశంపై చర్చించుకుంటూ ఉంటాం. మా ప్రణాళిక, సన్నద్ధత అటువైపు ఉండేలా చూసుకుంటాం. కొన్నిరోజులపాటు ఆటకు దూరమై వచ్చినప్పటికీ జట్టులో అలాంటి వాతావరణం మాత్రం మారిపోలేదు. గ్రూప్‌లోని మిగతా ఆటగాళ్ల సహచర్యం అద్భుతం. ఇలా ఉంటే టీమ్‌ కోసం ఏం చేయడానికైనా ప్లేయర్లు ముందడుగు వేస్తారు. ఆటను అర్థం చేసుకోవడంలో మా ఇద్దరి అభిప్రాయాలు, విజన్ ఒకటే. ప్రధాన లక్ష్యం సాధించే క్రమంలో ఎదురయ్యే అవాంతరాలు, ఇబ్బందులను దాటుకొని ముందుకు వెళ్తాం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో సిద్ధమయ్యారు. కీలక సమయంలో ఒత్తిడిని ఎలా తట్టుకోగలరనేది ప్రధానం. భారీ మ్యాచుల్లో జట్టును సరైన మార్గంలో నడిపించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం. ఒక్కసారి టోర్నీలో అడుగుపెడితే ఆటగాళ్లు దారిలోకి వచ్చేస్తారు" అని కోహ్లీ తెలిపాడు.

మెల్‌బోర్న్‌ వేదికగా దాదాపు లక్ష మంది అభిమానుల మధ్య జరిగే భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌పైనా విరాట్ కోహ్లీ స్పందించాడు. "ఇక్కడ ఆట కంటే.. భారీ సంఖ్యలో వచ్చే ఆటగాళ్ల మధ్య ఆడటం నాకిష్టం. అలాంటి అనుభవం ఈడెన్‌ గార్డెన్స్‌లో అనుభవించా. అక్కడ దాదాపు 90వేల మంది క్రికెట్‌ అభిమానుల మధ్య ఆడటం గొప్పగా అనిపించింది. నేను నడిచి వెళ్తుంటే సచిన్‌ తెందూల్కర్, సునిల్ గావస్కర్, కపిల్‌ దేవ్, వసీమ్‌ అక్రమ్, వకార్ యూనిస్‌ వంటి దిగ్గజాలు అభినందించడం మరువలేను. ఇలాంటిదే గత ప్రపంచకప్‌ సందర్భంగా మొహాలీలో చూశా. వరల్డ్‌ కప్‌లు అంటేనే ఒత్తిడెక్కువ. అనుభూతి ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ మనల్ని గమనిస్తూ ఉంటారు. ఇలాంటి క్షణాలు నాకు చాలా ఇష్టం. గేమ్‌ ఆడేది ఇలాంటి ఉద్విగ్నభరిత క్షణాలను అనుభవించేందుకు" అని కోహ్లీ పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: T20 worldcup: భారత్​-పాక్ మ్యాచ్​.. ఈ ప్లేయర్స్​ ఎదురుపడితే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.