ETV Bharat / sports

ఇంగ్లాండ్​తో రీషెడ్యూల్​ టెస్టు.. భారత స్టార్​ ఓపెనర్​ అనుమానమే! - కేఎల్​ రాహుల్​ ఇంగ్లాండ్​ రీషెడ్యూల్​ టెస్టు

KL Rahul England rescheduled test: ఇంగ్లాండ్​తో జరగనున్న రీషెడ్యూల్​ టెస్టుకు టీమ్​ఇండియా ఓపెనర్​ కేఎల్ రాహుల్​ అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. అతడు కోలుకోవడానికి ఇంకా సమయం పట్టేలా ఉందని తెలుస్తోంది.

KL rahul reschedule test
కేఎల్​ రాహుల్​ ఇంగ్లాండ్​ రీషెడ్యూల్ టెస్టు
author img

By

Published : Jun 15, 2022, 10:57 AM IST

KL Rahul England rescheduled test: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న సిరీస్​కు ముందు గాయపడ్డ కేఎల్​ రాహుల్​ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం జాతీయ క్రికెట్​ అకాడమీలో చికిత్స పొందుతున్న అతడు వచ్చే నెలలో ఇంగ్లాండ్​తో జరగబోయే రీషెడ్యూల్​ టెస్టుకు అందుబాటులో ఉండటం అనుమానంగానే ఉంది.

"రాహుల్​ ఇంకా కోలుకోలేదని తెలిసింది. ఇంగ్లాండ్​తో జరుగుతున్న టెస్టుకు అతడు ఆడటం అనుమానమే. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుంది." ఓ క్రికెట్​ ప్రతినిధి తెలిపారు. కాగా, గతేడాది ఇంగ్లాండ్​- టీమ్​ఇండియా మధ్య జరగాల్సిన చివరి టెస్టు కరోనా కారణంగా అర్ధంతరంగా నిలిచిపోయింది. దాన్ని రీషెడ్యూల్​ చేసి జులై 1న నిర్వహిస్తున్నారు. దీనికి రాహుల్​ అందుబాటులో ఉండట్లేదని తెలిసింది. ఇక ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్​లు టీ20 సిరీస్​లో తొలి రెండు మ్యాచుల్లో భారత జట్టు ఓడిపోగా.. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మూడో టీ20లో 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో రుతురాజ్‌ గైక్వాడ్ (57; 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (54; 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో రాణించారు. బౌలింగ్​లో హర్షల్​ పటేల్​, చాహల్​ మెరిశారు.

ఇదీ చూడండి: మళ్లీ మెరిసిన నీరజ్​ చోప్రా.. ఈసారి జాతీయ రికార్డు కైవసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.