ETV Bharat / sports

ఆ బాలుడికి అండగా భారత స్టార్ క్రికెటర్.. రూ.31 లక్షలు సాయం - kl rahul donations

KL Rahul Donation: భారత క్రికెటర్​ కేఎల్​ రాహుల్​.. ఓ బాలుడికి అండగా నిలిచాడు. అరుదైన రక్త రుగ్మతతో బాధపడుతున్న 11 ఏళ్ల బాలుడి ఆపరేషన్​కు రూ.31 లక్షలు సమకూర్చి తన ఔదార్యం చాటుకున్నాడు.

kl rahul donations
kl rahul donations
author img

By

Published : Feb 22, 2022, 8:35 PM IST

KL Rahul Donation: అత్యంత అరుదైన రక్త రుగ్మత​తో బాధపడుతున్న 11ఏళ్ల వరద్​కు భారీ ఆర్థిక సాయం చేసి తన గొప్పమనసు చాటుకున్నాడు భారత క్రికెటర్​ కేఎల్​ రాహుల్​. ఆ చిన్నారి ఎముక మజ్జ మార్పిడి (బోన్​ మ్యారో) కోసం రూ.31 లక్షలు విరాళంగా ఇచ్చాడు. నిధులు సమకూరుస్తున్న గివ్​ ఇండియా ద్వారా విషయాన్ని తెలుసుకున్న రాహుల్​ చలించిపోయాడు. దీంతో తన బృందం ద్వారా వరద్ తల్లిదండ్రులను సంప్రదించి.. ఆపరేషన్​కు కావాల్సిన ఆర్థిక సాయాన్ని అందజేశాడు.

సకాలం రాహుల్​ సాయం చేయడంతో వరద్​ ఆపరేషన్​ విజయవంతమైంది. ప్రస్తుతం ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న రాహుల్​ సంతోషం వ్యక్తం చేశాడు. భవిష్యత్తులో ఆ చిన్నారి తన కలలను సాధించాలని రాహుల్ ఆకాంక్షించాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు తన ఈ ప్రయత్నం మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నట్లు రాహుల్‌ తెలిపాడు.

రాహుల్​కు కృతజ్ఞతలు తెలిపిన వరద్​ తల్లిదండ్రులు సచిన్‌, స్వప్నఝా.. అతడికి రుణపడి ఉంటామన్నారు. రాహుల్​ ముందుకు రాకపోతే సకాలంలో వరద్​కు శస్త్రచికిత్స జరిగేది కాదన్నారు. తన కుమారుడికి కూడా రాహుల్​లా.. క్రికెటర్​ కావాలని కోరిక ఉందని చెప్పారు.

గివ్​ఇండియా కూడా రాహుల్​కు ధన్యవాదాలు తెలిపింది. వరద్​కు ఆర్థిక సాయం చేసి పునర్జన్మ కల్పించారని ప్రశంసించారు. ఈ సాయం ద్వారా స్పూర్తిగా నిలిచాడని కొనియాడారు.

ఇదీ చూడండి: Tim David IPL 2022: 'బుమ్రాను ఢీకొట్టేందుకు నేను రెడీ!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.