ETV Bharat / sports

IND VS WI: టీ20 సిరీస్​కు కీలక ఆటగాళ్లు దూరం

KL Rahul Axar patel injured: వెస్టిండీస్​తో ప్రస్తుతం జరుగుతున్న మూడో వన్డేలో టీమ్​ఇండియా కేఎల్​ రాహుల్ గాయపడ్డాడు. దీంతో అతడు టీ20 సిరీస్​కు దూరంకానున్నాడు. ఇక కరోనా నుంచి కోలుకున్న అక్సర్​ పటేల్ ఈ సిరీస్​కు అందుబాటులో ఉండట్లేదు. వీరిద్దరి స్థానాల్లో రుతురాజ్​ గైక్వాడ్​, దీపక్​ హూడా ఆడనున్నారు.

KL rahul Axar patel out of T20 series
కేఎల్​ రాహుల్​, అక్సర్​ పటేల్​ దూరం
author img

By

Published : Feb 11, 2022, 6:58 PM IST

Updated : Feb 11, 2022, 7:26 PM IST

KL Rahul Axar patel injured: టీమ్​ఇండియా ప్లేయర్స్​ కేఎల్​ రాహుల్​, ఆల్​రౌండర్​ అక్సర్​ పటేల్​ వెస్టిండీస్​తో జరగాల్సిన టీ20 సిరీస్​కు దూరమయ్యారు. వారి స్థానాల్లో రుతురాజ్​ గైక్వాడ్​, దీపక్​ హూడాకు అవకాశమివ్వనున్నట్లు తెలిపింది బీసీసీఐ. నేడు(శుక్రవారం) విండీస్​తో జరుగుతున్న మూడో వన్డేలో ఫీల్డింగ్​ చేస్తుండగా కేఎల్​ రాహుల్​ గాయపడ్డాడు. ఎడమకాలు కండరాల నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల అతడు అందుబాటులో ఉండట్లేదు. ప్రస్తుతం అతడికి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ఆ తర్వాత బెంగళూరలోని నేషనల్​ క్రికెట్​ అకాడమీకి తరలించనున్నారు.

ఇక వన్డే సిరీస్​ ఆరంభానికి ముందు అక్షర్​ పటేల్​, ధావన్​, శ్రేయస్​ అయ్యర్​ కరోనా బారిన పడ్డారు. ఈ ముగ్గురు కొవిడ్​ నుంచి కోలుకున్నప్పటికీ అక్షర్​ ఫిట్​నెస్​ మెరుగుపరుచుకునేందుకు రిహాబిలిటేషన్​ సెంటర్​కు పంపించబోతున్నట్లు తెలిపింది బోర్డు. అందుకే అతడిని సిరీస్​కు దూరం ఉంచినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: IND VS WI: శ్రేయస్​, పంత్​ అదరహో.. విండీస్​ లక్ష్యం ఎంతంటే?

Last Updated : Feb 11, 2022, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.