ETV Bharat / sports

'రాహుల్​-అతియా' పెళ్లి వేడుకలు షురు.. బెంగళూరు, ముంబయిల్లో రిసెప్షన్స్.. వారికే ఆహ్వనం! - KL Rahul Athiya Shetty wedding news

బాలీవుడ్​ స్టార్​ సునీల్​ శెట్టి గారాల పట్టి అతియా శెట్టి, స్టార్​ క్రికెటర్​ కేఎల్​ రాహుల్​ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. 2019లో ప్రేమలో పడ్డ ఈ జంట సోమవారం జరగనున్న పెళ్లి వేడుకతో ఒకటవ్వనున్నారు. ఇప్పటికే ఇద్దరి ఇళ్లలో సందడి మొదలవ్వగా అటు ముంబయిలోని రాహుల్​ ఇంటితో పాటు ఇటు ఖండాలాలోని పెళ్లి వేదికైన అతియా నివాసంలోని పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి.

kl rahul athiya shetty marriage
kl rahul athiya shetty marriage
author img

By

Published : Jan 22, 2023, 11:56 AM IST

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సునీల్‌ శెట్టి గారాల పట్టి అతియా శెట్టి, టీమ్ ​ఇండియా క్రికెటర్​ కేఎల్‌ రాహుల్‌ సోమవారం వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. మహారాష్ట్ర ఖండాలలోని సునీల్​ శెట్టి ఫామ్​ హౌజ్​​లో జనవరి 21నే ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కాగా పెళ్లి తర్వాత సునీల్ శెట్టి, రాహుల్ కుటుంబాలు రెండు రిసెప్షన్ పార్టీలు జరుపుకోనున్నట్లు సమాచారం. బెంగళూరు, ముంబయిలో జరగనున్న ఈ రిసెప్షన్లకు భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు, బాలీవుడ్ నటులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు హాజరుకానున్నారు.

పెళ్లి వేడుకల్లో భాగంగా మెహందీ, హల్దీ సంగీత్​ లాంటివి ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే పెళ్లికి మాత్రం దగ్గరి బంధువులను, స్నేహితులను మాత్రమే ఆహ్వానించినట్లు సమాచారం. కాగా వీరిద్దరు గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ తరచూ తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటీకీ 2021లో వారు తమ బంధం గురించి అధికారికంగా ప్రకటించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.