KL Rahul Asia Cup 2023 : ఆసియా కప్‌లో భాగంగా జరిగిన భారత్-పాక్ సూపర్ 4 మ్యాచ్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చిన టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మైదానంలో దుమ్మురేపుతున్నాడు. ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన ఈ స్టార్ ప్లేయర్.. సూపర్-4 జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకంగా మారాడు. ఇక అదే జోరును కొనసాగిస్తున్న రాహుల్.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ చెలరేగిపోయాడు. ఇషాన్ కిషన్‌తో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన అతడు బ్యాటింగ్‌లో సత్తా చాటాడు. అయితే శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తాజాగా వికెట్ కీపర్‌గానూ తన ట్యాలెంట్‌ను చూపించాడు. అలా మాజీ క్రికెటర్ మిస్టర్ కూల్ ధోనీని తలపించాడు.
మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టులో ఉన్న సమయంలో కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ జోడీ ఓ వెలుగు వెలిగింది. వికెట్ల వెనుకాల ఉన్న ధోనీ బ్యాటర్ల కదిలికలను పసిగట్టి మరీ ఈ ఇద్దరికీ సలహాలు ఇచ్చేవాడు. అతని సూచనలకు తగ్గట్లుగానే బౌలింగ్ చేసే కుల్దీప్, చాహల్ వికెట్లును పడగొట్టేవారు. తాజాగా కేఎల్ రాహుల్ చేసిన ఓ పని కూడా ధోనీని తలపించింది.
రాహుల్ ఇచ్చిన సలహాలతో బౌలింగ్ చేసిన కుల్దీప్ యాదవ్.. సమర విక్రమార్కను స్టంపౌట్‌గా పెవిలియన్ బాట పట్టించాడు. 18వ ఓవర్‌కు ముందు కుల్దీప్ యాదవ్‌తో రాహుల్ చర్చించగా.. మూడో బంతికి సమరవిక్రమార్క స్టంపౌటయ్యాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజాకు కూడా పలు సూచనలు చేస్తూ కనిపించాడు. నెమ్మదిగా బౌలింగ్ చేయాలని, వేగంగా బౌలింగ్ బంతి టర్న్ అవ్వడం లేదంటూ చెప్పాడు. రాహుల్ సూచనల మేరకు మూడు బంతులను నెమ్మదిగా వేయడం వల్ల శ్రీలంక బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత వేగంగా వేయడం వల్ల శ్రీలంక బ్యాటర్ బౌండరీకి తరలించాడు. దాంతో వికెట్లు తీసే విషయంలో రాహుల్ సూచనలు కీలకమనే విషయం అర్థమైంది.
-
As 'KUL' as it gets! 🧊@imkuldeep18 continues his sensational form as he rips one through the batter, while @klrahul pulls off a sharp stumping. 💥
— Star Sports (@StarSportsIndia) September 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/NZccClhhRW
">As 'KUL' as it gets! 🧊@imkuldeep18 continues his sensational form as he rips one through the batter, while @klrahul pulls off a sharp stumping. 💥
— Star Sports (@StarSportsIndia) September 12, 2023
Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/NZccClhhRWAs 'KUL' as it gets! 🧊@imkuldeep18 continues his sensational form as he rips one through the batter, while @klrahul pulls off a sharp stumping. 💥
— Star Sports (@StarSportsIndia) September 12, 2023
Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/NZccClhhRW
అయితే ఈ మ్యాచ్‌లో రాహుల్ వికెట్ కీపింగ్ చూసిన అభిమానులు.. రాహుల్‌ను చూస్తే ధోనీ గుర్తొచ్చాడంటూ నెట్టింట ఆ వికెట్ కీపింగ్ వీడియోనూ తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇక తన కమ్‌బ్యాక్‌తో రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడి ఇలా జట్టుకు సపోర్టింగ్ సిస్టమ్‌గా ఉండటం ఎంతో ఆనందంగా ఉందంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
-
Kuldeep Yadav gets the breakthrough as he picks up the wicket of Sadeera Samarawickrama.
— BCCI (@BCCI) September 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
KL Rahul with some fine glove work behind the stumps.
Live - https://t.co/0YsK7eqZaf… #INDvSL pic.twitter.com/wexT7ojSrF
">Kuldeep Yadav gets the breakthrough as he picks up the wicket of Sadeera Samarawickrama.
— BCCI (@BCCI) September 12, 2023
KL Rahul with some fine glove work behind the stumps.
Live - https://t.co/0YsK7eqZaf… #INDvSL pic.twitter.com/wexT7ojSrFKuldeep Yadav gets the breakthrough as he picks up the wicket of Sadeera Samarawickrama.
— BCCI (@BCCI) September 12, 2023
KL Rahul with some fine glove work behind the stumps.
Live - https://t.co/0YsK7eqZaf… #INDvSL pic.twitter.com/wexT7ojSrF
Asia Cup 2023 IND VS PAK : కోహ్లీ-కేఎల్ రాహుల్ సెంచరీ.. పాకిస్థాన్ ముందు భారీ లక్ష్యం..
Atiya Shetty KL Rahul : భర్త సెంచరీపై అతియా ఎమోషనల్ పోస్ట్.. అతనే నెంబర్ వన్ అంటూ..