ETV Bharat / sports

తొలి విజయం కోసం ముంబయి.. 'టాప్​' కోసం కోల్​కతా - ipl preview

KKR vs MI: ఐదుసార్లు ఛాంపియన్​ ముంబయి ఇండియన్స్ ఈ ఐపీఎల్​లో​​ తొలి విజయం కోసం.. పాయింట్ల పట్టికలో టాప్​ కోసం కోల్​కతా నైట్​రైడర్స్​ చూస్తున్నాయి. ఈ రెండు జట్ల మధ్య బుధవారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్​ జరగనుంది.

KKR vs MI: Winless Mumbai Indians face uphill task against KKR

author img

By

Published : Apr 6, 2022, 1:30 PM IST

KKR vs MI: ఈ ఐపీఎల్​లో వరుసగా రెండు మ్యాచ్​లు ఓడిన ముంబయి ఇండియన్స్​.. బుధవారం కోల్​కతా నైట్​రైడర్స్​తో తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు పుణెలోని ఎంసీఏ వేదికగా మ్యాచ్​ జరగనుంది. కోల్​కతా ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్​ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ముంబయితో గెలిస్తే అగ్రస్థానంలోకి వెళ్తుంది. గత మ్యాచ్​లో పంజాబ్​ను 6 వికెట్ల తేడాతో ఓడించింది కోల్​కతా. ముంబయి తొలుత దిల్లీ క్యాపిటల్స్​ చేతిలో 4 వికెట్లు, రాజస్థాన్​ రాయల్స్​ చేతిలో 23 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ముంబయిని ముంచుతున్న బౌలింగ్: ఐదుసార్లు ఐపీఎల్​ ఛాంపియన్స్​గా నిలిచిన ముంబయిని ఈసారి బౌలింగ్​ వేధిస్తోంది. బుమ్రా, మురుగన్​ అశ్విన్​ మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేకపోతున్నారు. పేసర్​ బాసిల్​ థంపి ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. ఆసీస్​ ఆల్​రౌండర్ డేనియల్​ సామ్స్​ పరుగులు ఎక్కువగా ఇవ్వకున్నా.. వికెట్లు తీయలేకపోతున్నాడు. డెత్​ ఓవర్లలో బుమ్రాకు సహకరించే మరో బౌలర్​ లేకపోవడం ముంబయికి లోటుగా కనిపిస్తోంది. బ్యాటింగ్​లో రోహిత్​కు కోల్​కతాపై మంచి రికార్డు ఉంది. రోహిత్​ అదే జోరు కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరో ఓపెనర్​ ఇషాన్​ కిషన్​ ఆడిన రెండు మ్యాచ్​ల్లో అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నాడు. భారీ స్కోరు చేయాల్సి వస్తే ఈ ఇద్దరి ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటుంది. సూర్యకుమార్​ యాదవ్​ ఈ మ్యాచ్​కైనా అందుబాటులోకి వస్తాడో రాడో స్పష్టత లేదు. ఒకవేళ వస్తే.. ముంబయి బ్యాటింగ్​ బలోపేతం అవుతుందనడంలో సందేహం లేదు. యువకెరటం తిలక్​ వర్మ.. అద్భుతంగా రాణిస్తున్నాడు. రాయల్స్​తో మ్యాచ్​లో జట్టును గెలిపించినంత పనిచేశాడు. అన్మోల్​ప్రీత్​ సింగ్​, కీరన్​ పొలార్డ్​, టిమ్​ డేవిడ్​ తమను తాము నిరూపించుకోవాల్సి ఉంది. ​​అంతర్జాతీయ టీ-20 లీగ్​ల్లో సత్తాచాటిన టిమ్​.. ఇండియా పిచ్​లపై రాణించలేకపోతున్నాడు. ఇతడి స్థానంలో బేబీ ఏబీ- డెవాల్డ్​ బ్రేవిస్​ను పరిశీలిస్తుందో చూడాలి.

సమతూకంగా కోల్​కతా: కోల్​కతాకు సంతృప్తి కలిగించే విషయం ఏంటంటే.. విండీస్​ విధ్వంసకర ప్లేయర్​ ఆండ్రీ రసెల్​ ఫామ్​లోకి రావడం. పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 31 బంతుల్లోనే 70 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు. అతడి నుంచి మరోసారి అలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది కేకేఆర్​. ఓపెనర్లు వెంకటేశ్​ అయ్యర్​, అజింక్య రహానే ఫామ్​ కలవరపెడుతోంది. కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​ ఇన్నింగ్స్​ బాగానే ప్రారంభిస్తున్నా.. భారీ స్కోరుగా మలచలేకపోతున్నాడు. సామ్​ బిల్లింగ్స్​, నితీశ్​ రాణా కూడా అంతలా రాణించింది లేదు. బౌలింగ్​లో టీమ్​ఇండియా సీనియర్​ పేసర్​ ఉమేశ్​ యాదవ్​ ముందుండి నడిపిస్తున్నాడు. 3 మ్యాచ్​ల్లో 8 వికెట్లతో పర్పుల్​ క్యాప్​ ఉమేశ్​ దగ్గరే ఉంది. టిమ్​ సౌథీ, శివం మావి.. ఉమేశ్​ చక్కటి సహకారం అందిస్తే ముంబయిని తక్కువ స్కోరుకే పరిమితం చేయొచ్చు. కట్టుదిట్టంగా బంతులు వేసే మిస్టరీ స్పిన్నర్లు సునీల్​ నరైన్​, వరుణ్​ చక్రవర్తి ఎలాగూ ఉండనే ఉన్నారు. ఇరుజట్ల రికార్డు చూస్తే.. ముంబయి చాలా ముందంజలో ఉంది. ముంబయి ఇండియన్స్​ 22 సార్లు గెలిస్తే.. కోల్​కతా 7 మ్యాచ్​ల్లోనే నెగ్గింది.

ఇవీ చూడండి: Korea Open: రెండో రౌండ్​కు దూసుకెళ్లిన సింధు, శ్రీకాంత్​

'అతడిని దక్కించుకోవడమే ఐపీఎల్​ వేలంలో అత్యుత్తమ కొనుగోలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.