Pietersen on Rohit: టెస్టు కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ వీడ్కోలు నిర్ణయం తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. చాలా రోజులపాటు బయోబబుల్‌లో ఆడటం సవాల్‌తో కూడుకున్నదేనని, అందుకే విరాట్ కెప్టెన్ బాధ్యతలను వదిలేసి ఉంటాడని అభిప్రాయపడ్డాడు. విరాట్ స్థానంలో టెస్టు ఫార్మాట్‌కు రోహిత్ శర్మనే నియమించాలని సూచించాడు.
"విరాట్ స్థానంలో టెస్టు జట్టుకు సారథిగా ఎవరిని నియమించాలని అడిగితే మాత్రం ఇద్దరి పేర్లనే చెబుతా. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ మాత్రమే ఛాయిస్. రిషభ్ పంత్ టెస్టులకు అవసరం లేదు.. కానీ, వన్డే జట్టు కెప్టెన్‌గా అయితే ఓకే అని చెప్పగలను. హిట్‌మ్యాన్ ఆటను ఆస్వాదించేందుకు ఎంతో ఇష్టపడతా. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ కోసం చాలా కష్టపడ్డాడు."
-పీటర్సన్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్
ఐపీఎల్ కారణం కాదు
యాషెస్ సిరీస్‌ను ఇంగ్లాండ్ ఓడిపోవడంపై ఐపీఎల్‌ను బూచిగా చెప్పడం సరికాదన్నాడు పీటర్సన్. ఇంగ్లాండ్ టెస్టు జట్టులో కేవలం నలుగురు మాత్రమే (స్టోక్స్, బెయిర్‌స్టో, బట్లర్, మలన్) ఐపీఎల్‌లో ఆడుతున్నారని, మిగతావారు లేరని గుర్తు చేశాడు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!