ETV Bharat / sports

కెప్టెన్​గా బాబర్ అజామ్.. వరుసగా ఏడు ఓటములు

పాకిస్థాన్​ సూపర్ లీగ్​ 2022లో కరాచీ కింగ్స్​కు మళ్లీ నిరాశే ఎదురైంది. బాబర్ కెప్టెన్​గా వ్యవహరిస్తున్న ఈ టీం.. వరుసగా ఏడో మ్యాచ్​లోనూ ఓడిపోయింది.

babar azam
బాబర్ ఆజామ్
author img

By

Published : Feb 15, 2022, 11:20 AM IST

Updated : Feb 15, 2022, 12:28 PM IST

పాకిస్థాన్ సూపర్ లీగ్ 2022​లో కరాచీ కింగ్స్​ వరుసగా ఏడో మ్యాచ్​లోనూ ఓడిపోయింది. ఇస్లామాబాద్​ యూనైటెడ్​తో ఫిబ్రవరి 14న జరిగిన మ్యాచ్​లో ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో ఇంకా ఖాతా తెరవలేదు. ప్రపంచ స్థాయిలోనే అగ్రశ్రేణి బ్యాటర్​లలో ఒకడైన బాబర్ కెప్టెన్​గా ఉన్న జట్టు ఇలా వరుస ఓటమిపాలవ్వడం క్రికెట్ ప్రియులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

తాజా ఓటమితో కరాచీ కింగ్స్ లీగ్​ దశలోనే వైదొలగనుంది. ఇస్లామాబాద్ యునైటెడ్ నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి పట్టికలో మూడో స్థానంలో ఉంది.ఇస్లామాబాద్ యూనిటైడ్ మెుదట బ్యాటింగ్​ చేసి నిర్ణీత 20 ఓవర్లుకు గానూ191 పరుగులు చేసింది. షాదాబ్​ ఖాన్​ (26 బంతుల్లో 34 పరుగులు),ఆజామ్ ఖాన్(14 బంతుల్లో 22 పరుగులు), అసిఫ్ అలీ(11 బంతుల్లో 28) రాణించారు. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్​కు మరోమారు ఓటమి తప్పలేదు.

ఇదీ చదవండి: వీరిపై కోట్లు కుమ్మరించిన ఫ్రాంఛైజీలు!

Last Updated : Feb 15, 2022, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.