Kapil Dev Kidnap : భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కిడ్నాప్ అయినట్టు ఓ వీడియో నిన్నట్నుంచి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద చర్చే సాగింది. ఓ ఇద్దరు వ్యక్తులు కపిల్ దేవ్ నోటిలో గుడ్డలు కుక్కి మరీ ఓ ఇంట్లోకి ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
ఇది చూసిన కొంతమంది అభిమానులు నిజం అని అనుకోగా మరి కొంతమంది ఏమానా యాడ్ కోసం అయి ఉంటుందని భావించారు. దీనికి సంబంధించిన వీడియోను మాజీ క్రికెటర్ గంభీర్ కూడా పోస్ట్ చేశారు. అయితే తాజాగా కపిల్ దేవ్ కథ సుఖాంతం అయింది. ఇదంతా ఓ యాడ్ కోసం అని తెలిసిపోయింది. ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురయ్యేలా చేసే ఆలోచన వచ్చింది డిస్నీ హాట్ స్టార్‌కే. వరల్డ్ కప్ రైట్స్ వారి దగ్గరే ఉన్నాయి. అందుకే ఇలా చేసింది.
2023 ODI World Cup : గడిచిన ఐదేళ్లుగా టీమ్ఇండియాకు ప్రసారదారుగా ఉన్న స్టార్.. రీసెంట్గా రిలయన్స్‌తో పోటీ పడలేక పక్కకు తప్పుకుంది. కానీ ఐసీసీ ఈవెంట్స్ రైట్స్ ఇంకా స్టార్ దగ్గరే ఉన్నాయి. అయితే ఈసారి వరల్డ్ కప్‌ను ఉచితంగా అందించేందుకు హాట్ స్టార్ సిద్ధమైంది. అది కూడా డేటాసేవర్ మోడ్‌లో. అందులో భాగంగానే ఈ యాడ్‌ను రూపొందించారు. "అరే కపిల్‌జీ బాగా ఆడారు! యాక్టింగ్‌లో కూడా ప్రపంచకప్ ఉంటే మీరే గెలిచేస్తారు. ఐసీసీ మెన్స్ వరల్డ్‌కప్ మొబైల్ డిస్నిప్లస్ హాట్‌స్టార్‌లో ఫ్రీ అని ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని పేర్కొంటూ గంభీర్ ఈ యాడ్ వీడియోను పోస్టు చేశారు.
Kapil Dev World Cup Captain : కాగా, కపిల్ సేన.. 1983లో మొదటిసారి వన్డే వరల్డ్ కప్‌ను అందించింది. ఆ తర్వాత క్రికెట్‌లో కపిల్ స్టార్ ప్లేయర్‌గా ఎదిగారు. కెరీర్‌లో 131 టెస్టులు ఆడి 5,248 పరుగులు, 438 వికెట్లు తీశారు. వన్డేల్లో 225 మ్యాచ్‌లు ఆడి 3,783 పరుగులు చేయడంతో పాటు 253 వికెట్లు పడగొట్టారు. 1983 వరల్డ్ కప్‌లో జింబాబ్వేపై ఆయన చేసిన 175 పరుగుల ఇన్నింగ్స్.. భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది.
-
Anyone else received this clip, too? Hope it’s not actually @therealkapildev 🤞and that Kapil Paaji is fine! pic.twitter.com/KsIV33Dbmp
— Gautam Gambhir (@GautamGambhir) September 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Anyone else received this clip, too? Hope it’s not actually @therealkapildev 🤞and that Kapil Paaji is fine! pic.twitter.com/KsIV33Dbmp
— Gautam Gambhir (@GautamGambhir) September 25, 2023Anyone else received this clip, too? Hope it’s not actually @therealkapildev 🤞and that Kapil Paaji is fine! pic.twitter.com/KsIV33Dbmp
— Gautam Gambhir (@GautamGambhir) September 25, 2023
-
Areh @therealkapildev paaji well played! Acting ka World Cup 🏆 bhi aap hi jeetoge! Ab hamesha yaad rahega ki ICC Men's Cricket World Cup is free on @DisneyPlusHS mobile pic.twitter.com/755RVcpCgG
— Gautam Gambhir (@GautamGambhir) September 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Areh @therealkapildev paaji well played! Acting ka World Cup 🏆 bhi aap hi jeetoge! Ab hamesha yaad rahega ki ICC Men's Cricket World Cup is free on @DisneyPlusHS mobile pic.twitter.com/755RVcpCgG
— Gautam Gambhir (@GautamGambhir) September 26, 2023Areh @therealkapildev paaji well played! Acting ka World Cup 🏆 bhi aap hi jeetoge! Ab hamesha yaad rahega ki ICC Men's Cricket World Cup is free on @DisneyPlusHS mobile pic.twitter.com/755RVcpCgG
— Gautam Gambhir (@GautamGambhir) September 26, 2023
BCCI Team India : ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. ఆ మాస్టర్ ప్లాన్‌తో టీమ్ఇండియా ఓ మెట్టు పైకి