ETV Bharat / sports

WTC Final: 'కోహ్లీసేనతో పోటీ కఠినమే' - kane williamson about kohli

ప్రపంచటెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో(WTC Final) టీమ్​ఇండియాతో పోటీ కఠినంగా ఉంటుందని అన్నాడు న్యూజిలాండ్​ సారథి కేన్​ విలియమ్సన్(Kane Williamson)​. కోహ్లీతో కలిసి టాస్​కు రావడం సంతోషంగా ఉంటుందని వెల్లడించాడు. భారత జట్టు బౌలింగ్​ దాడి పటిష్టంగా ఉందని ప్రశంసించాడు.

Kane Williamson
కేన్​ విలియమ్సన్​.. కోహ్లీ
author img

By

Published : Jun 8, 2021, 9:05 AM IST

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీతో కలిసి ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌(WTC Final) టాస్‌కు రావడం సంతోషంగా ఉంటుందని కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(Kane Williamson)​ అన్నాడు. ప్రస్తుతం భారత బౌలింగ్‌ దాడి ఎంతో బలంగా ఉందని ప్రశంసించాడు. వారితో పోటీ కఠినంగా ఉంటుందని అంచనా వేశాడు. ఫైనల్‌ పోరు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని వెల్లడించాడు.

"కోహ్లీతో(Kohli) కలిసి ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ టాస్‌కు రావడం బాగుంటుంది. వారితో పోటీ కఠినంగానే ఉంటుంది. కొన్నేళ్లుగా మా రెండు జట్లు వేర్వేరు ఫార్మాట్లలో తలపడ్డాయి. ఎవరెలా ఆడతారో పరస్పరం అవగాహన ఉంది. అందుకే టాస్‌కు రావడం, విరాట్‌తో మాట్లాడటం, ఫైనల్లో పోటీ పడటం బాగుంటుంది"

-విలియమ్సన్‌, న్యూజిలాండ్​ సారథి.

భారత బౌలింగ్‌ దాడి పటిష్ఠంగా ఉందని కేన్‌ ప్రశంసించాడు. "అవును, వాళ్ల బౌలింగ్ విభాగం దుర్భేద్యంగా ఉంది. వారి బౌలింగ్ దాడిపై మాకు అవగాహన ఉంది. ఆస్ట్రేలియాలో వాళ్లేం చేశారో మేం చూశాం. వారి పేస్‌, స్పిన్‌ విభాగాలు అత్యంత పటిష్ఠంగా ఉన్నాయి. వారి బౌలింగ్‌ ఇప్పుడు అగ్రస్థానంలో ఉందనడంలో సందేహం లేదు. అందుకే అత్యుత్తమ జట్టుతో ఫైనల్‌ ఆడుతుండటం మాలో ఉత్సాహాన్ని, ఆసక్తినీ పెంచుతున్నాయి" అని విలియమ్సన్‌ అన్నాడు.

విరాట్‌, విలియమ్సన్‌ మైదానంలోనే కాకుండా బయటా మంచి మిత్రులు. ఇద్దరూ ఒకర్నొకరు గౌరవించుకుంటారు. మహ్మద్‌ షమి(MOhammed Shami), ఇషాంత్‌(Ishanth), బుమ్రా(Bumrah), ఉమేశ్‌(Umesh), సిరాజ్‌(siraj), అశ్విన్‌(Ashwin), జడేజా(Jadeja), అక్షర్‌ పటేల్‌తో(Axar Patel) కూడిన భారత బౌలింగ్‌ దళం అత్యంత పటిష్ఠంగా ఉందని, మరోవైపు కివీస్‌ బౌలింగ్‌ సైతం దూకుడుగానే ఉంటుందని క్రికెట్​ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి: 'కోహ్లీ, విలియమ్సన్ సారథ్యంపైనే అందరి దృష్టి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.