ETV Bharat / sports

Kane Williamson Injury Update : న్యూజిలాండ్​కు బిగ్​ షాక్​.. కేన్​ మామ ఎంత పనైపోయింది!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 4:39 PM IST

Kane Williamson Injury Update : వన్డే వరల్డ్ కప్​ 2023 న్యూజిలాండ్​కు పెద్ద షాక్ తగిలింది. గాయం కారణంగా కేన్​ మామ మిగితా మ్యాచ్​లకు దూరం కానున్నట్లు తెలిసింది.

Kane Williamson Injury Update : న్యూజిలాండ్​కు బిగ్​ షాక్​.. కేన్​ మామ ఎంత పనైపోయింది!
Kane Williamson Injury Update : న్యూజిలాండ్​కు బిగ్​ షాక్​.. కేన్​ మామ ఎంత పనైపోయింది!

Kane Williamson Injury Update : వన్డే ప్రపంచకప్‌-2023లో వరుస విజయాలతో ముందుకెళ్తున్న న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ గాయం కారణంగా టోర్నీలోని మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నాడని తెలిసింది. ఈ ప్రతిష్టాత్మక మెగా ఈవెంట్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో​ జరిగిన మ్యాచ్‌లో అతడు గాయపడ్డాడు. ఫీల్డర్‌ విసిరిన త్రో.. విలియమ్సన్‌ ఎడమ చేతి వేలికి బలంగా తాకింది. దీంతో మైదానంలోనే కేన్‌మామ నొప్పితో విలవిలలాడాడు.

వెంటనే ఫిజియో వచ్చి అతడికి చికిత్స అందించినప్పటికీ నొప్పి మాత్రం తగ్గలేదు. దీంతో అతడిని చికిత్సకు పంపించారు. అయితే స్కానింగ్​లో అతడి ఎడమచేతి బొటనవేలు విరిగినట్లు తేలింది. దీని నుంకి కోలుకోవడానికి అతడికి కనీసం 6 వారాల సమయం పట్టనున్నట్లు సమాచారం అందింది. దీంతో అతడు మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉందట. అతడి ప్రత్యామ్నయంగా టామ్‌ బ్లండల్‌ బరిలోకి దిగనున్నాడని అంటున్నారు.

Kane Williamson ODI World Cup 2023 : కాగా విలియమ్స్​ను కొంతకాలంగా దురదృష్టం వెంటాడుతూనే ఉంది. 2019 ప్రపంచ కప్ తర్వాత గాయాల కారణంగా చాలా కాలం పాటు ఆటకు దూరమయ్యాడు. అనంతరం ఐపీఎల్‌-2023లో మళ్లీ గాయపడ్డాడు. రీసెంట్​గా బంగ్లాదేశ్‌ మ్యాచ్‌తోనే తిరిగి రీ ఎంట్రీ ఇచ్చాడు. పునరాగమనం చేసిన మొదటి మ్యాచ్‌లోనే మళ్లీ గాయపడడం అతడికి గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఇకపోతే బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. తన తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 18న అప్గానిస్థాన్​తో పోటీపడనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.