కేన్ విలియమ్సన్(Kane Williamson).. ప్రస్తుతం ఉన్న పాపులర్ క్రికెటర్లలో ఒకడు. ఫార్మాట్ ఏదైనా సరే తనదైన స్టైల్లో ఆడుతూ, కూల్‌గా ప్రత్యర్థిని ఓడిస్తూ పలు రికార్డులను సృష్టిస్తున్నాడు. ఇవన్నీ పక్కనపెడితే అతడి జీవితంలో ఓ అద్భుతమైన లవ్‌స్టోరీ ఉందనే విషయం చాలామందికి తెలియదు!
విలియమ్సన్ వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా బయటకు రాదు. తన ఇన్‌స్టాలో కూడా కేవలం ఒక్క ఫొటో మాత్రమే ఫ్యామిలీది ఉంటుంది. షారా రహీమ్‌తో ఐదేళ్లుగా రిలేషన్లో ఉన్న విలియమన్స్కు.. కొన్నాళ్ల క్రితం పాప పుట్టింది.
![Kane Williamson fell in love with a nurse during treatment](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12198063_kane-1.jpg)
అలా మొదలైంది..!
ఇంగ్లాండ్‌లో పుట్టిన సారా.. ఉద్యోగంలో భాగంగా న్యూజిలాండ్‌కు మారింది. స్వతహాగా నర్స్ అయిన ఆమెను.. సర్జరీ కోసం ఆస్పత్రికి చేరినప్పుడు విలియమ్సన్ చూశాడు. తొలిచూపులోనే సారాతో ప్రేమలో పడిపోయాడు. ఆ తర్వాత నంబర్లు మార్చుకోవడం సహా డేటింగ్ కూడా చేశారు. అయితే కొన్ని ఈవెంట్లలో వీరిద్దరూ జంటగా కనిపిస్తూ వచ్చారు. గతేడాది డిసెంబరులో పాప పుట్టిన తర్వాత వీరి బంధం గురించి అందరికీ తెలిసింది. పాప పుట్టిన కొన్నిరోజులకు టెస్టుల్లో విలియమ్సన్ డబుల్ సెంచరీ చేశాడు. దానిని తన కూతురికి బహుమతిగా ఇచ్చాడు!
ఆసక్తికర విషయమేమిటంటే విలియమ్సన్ సతీమణికి కుమార్తె పుట్టిన నెలలోనే అతడి స్నేహితుడు విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా 'వామిక'కు జన్మనిచ్చింది.
![Kane Williamson fell in love with a nurse during treatment](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12198063_kane-2.jpg)
ఇవీ చదవండి: