ETV Bharat / sports

Universe Boss: ఐసీసీ సీరియస్​.. పేరు మార్చుకున్న గేల్​ - గేల్ ది బాస్

వెస్టిండీస్​ విధ్వంసకర బ్యాట్స్​మన్ క్రిస్​ గేల్​ (Chris Gayle)​ను ఇటీవలీ కాలంలో చాలా వరకు 'యూనివర్స్​ బాస్​' (Universe Boss)గా పిలుస్తున్నారు. అయితే తాజాగా ఆసీస్​తో జరిగిన టీ20లో అతడి బ్యాట్​పై 'ది బాస్​'(The Boss) అనే మరో కొత్త స్టిక్కర్ కనిపించింది. ఈ పేరు మార్పు వెనక గల కారణాన్ని వివరించాడు గేల్.

chris gayle, icc
క్రిస్ గేల్, ఐసీసీ
author img

By

Published : Jul 14, 2021, 11:53 AM IST

వెస్టిండీస్‌ స్టార్‌ ప్లేయర్‌ క్రిస్‌ గేల్‌ (Chris Gayle)కు 'యూనివర్స్‌ బాస్‌'(Universe Boss) అనే ముద్దు పేరుంది. ఆ పేరును స్వయంగా పెట్టుకున్నాడు. కొంతకాలంగా అతడిని సంబోధించే క్రమంలో చాలా మంది అదే పేరుతో పిలుస్తున్నారు. అతడి బ్యాట్‌ మీద కూడా 'యూనివర్స్‌ బాస్‌' అనే స్టిక్కర్‌ ఉంటుంది.

అయితే, తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో.. గేల్‌ ఉపయోగించిన బ్యాట్‌ మీద 'ది బాస్‌'(The Boss) అనే కొత్త స్టిక్కర్‌ కనిపించింది. అందుకు సంబంధించిన పోస్టును ఓ ఆస్ట్రేలియా క్రికెట్‌ వెబ్‌సైట్‌ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఈ విషయంపై గేల్​ స్పష్టత ఇచ్చాడు.

వ్యాఖ్యాత: మీ బ్యాట్‌పై ఏముంది?

క్రిస్‌ గేల్‌: 'ది బాస్‌' అని మాత్రమే ఉంది. ఎందుకంటే నేను యూనివర్స్‌ బాస్‌ అని పిలుచుకోవడం ఐసీసీకి ఇష్టం లేదు. అందుకే దాన్ని కుదించి 'ది బాస్‌'గా పెట్టుకున్నా. నేనే బాస్‌.

వ్యాఖ్యాత: యూనివర్స్‌ బాస్‌పై ఐసీసీకి కాపీరైట్స్‌ ఉన్నాయా?

క్రిస్‌ గేల్‌: అవును. నేను కాపీరైట్‌ చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే సాంకేతికంగా క్రికెట్‌లో ఐసీసీయే బాస్‌. వాళ్లతో నేను పనిచేయను. ఐసీసీతో సంబంధం లేదు. బ్యాటింగ్‌లో నేనే బాస్‌.. అని ముగించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. హెన్రిక్స్‌ (33), కెప్టెన్‌ ఫించ్‌ (30) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. ఆపై ఛేదనకు దిగిన విండీస్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 14.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్​లో గేల్‌ (67; 38 బంతుల్లో 4x4, 7x6) రెచ్చిపోయి ఆడాడు. దాంతో విండీస్‌ 3-0 తేడాతో ఆస్ట్రేలియాపై సిరీస్‌ గెలుపొందింది.

ఇదీ చదవండి: దక్షిణాఫ్రికాపై ఐర్లాండ్ సంచలన విజయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.