ETV Bharat / sports

వరల్డ్​ కప్​ ముందు ఇంగ్లాండ్​కు 'బిగ్​' షాక్​.. విధ్వంసకర ప్లేయర్​ దూరం - bairstow injured

Bairstow Ruled Out : టీ20 ప్రపంచకప్​ ముందు ఇంగ్లాండ్​కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్​ జానీ బెయిర్​స్టో గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.

Jonny Bairstow ruled out of England's T20 World Cup 2022 squad

author img

By

Published : Sep 2, 2022, 9:35 PM IST

Bairstow Ruled Out : ఇంగ్లాండ్​ క్రికెట్​ జట్టుకు ఊహించని షాక్​ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్​ జానీ బెయిర్​స్టో టీ20 ప్రపంచకప్​కు దూరమయ్యాడు. ఈ టోర్నీ సహా రానున్న కొద్దికాలంలో ఇంగ్లాండ్​ ఆడనున్న అన్ని మ్యాచ్​లకు అందుబాటులో ఉండలేనని ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేశాడీ క్రికెటర్​.
శుక్రవారం ఉదయం గోల్ఫ్​ ఆడుతున్న సమయంలో అనుకోకుండా తన ఎడమకాలి దిగువ భాగంలో గాయమైందని, దానికి ఆపరేషన్​ అవసరమని పోస్ట్​ పెట్టాడు. బలంగా తిరిగొస్తానని పేర్కొన్న బెయిర్​స్టో, టీ20 వరల్డ్​కప్​కు వెళ్లనున్న ఇంగ్లాండ్​ టీంకు శుభాకాంక్షలు చెప్పాడు.

శుక్రవారమే టీ20 ప్రపంచకప్​ ఆడనున్న ఇంగ్లాండ్​ టీంను ప్రకటించింది బోర్డు. అందులో బెయిర్​స్టో పేరును ఉంచింది. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే బెయిర్​స్టో తప్పుకోవడం గమనార్హం. అనంతరం ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు కూడా బెయిర్​స్టో.. టీ20 వరల్డ్​కప్​ ఆడట్లేదని ట్వీట్​ చేసింది. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రపంచవ్యాప్తంగా ఇతర క్రికెటర్లు, అభిమానులు కూడా బెయిర్​స్టో త్వరగా కోలుకొని తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని ట్వీట్లు చేస్తున్నారు.

Jonny Bairstow ruled out of England's T20 World Cup 2022 squad
ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు పోస్ట్​

బెయిర్​స్టో స్థానంలో మరే ఇతర ఆటగాడి పేరును ప్రకటించలేదు ఇంగ్లాండ్​ జట్టు. ఆస్ట్రేలియా వేదికగా టీ-20 ప్రపంచకప్​ అక్టోబర్​ 16న మొదలవనుంది. ఈసారి ఇంగ్లాండ్​ టీంలో జేసన్​ రాయ్​కు చోటు దక్కలేదు. టెస్టు జట్టు కెప్టెన్​ బెన్​ స్టోక్స్​ను పునరాగమనం చేయనున్నాడు. జాస్​ బట్లర్​ కెప్టెన్​గా జట్టును నడిపించనున్నాడు.

ఇంగ్లాండ్​ టీ20 వరల్డ్​కప్​ స్క్వాడ్​: జాస్​ బట్లర్​(కెప్టెన్​), మొయిన్​ అలీ, హ్యారీ బ్రూక్​, సామ్​ కరన్​, క్రిస్​ జోర్డాన్​, లియామ్​ లివింగ్​స్టోన్​, డేవిడ్​ మలన్​, ఆదిల్​ రషీద్​, ఫిల్​ సాల్ట్​, బెన్​ స్టోక్స్​, రీస్​ తోప్లే, డేవిడ్​ విల్లీ, క్రిస్​ వోక్స్​, మార్క్​ వుడ్​.

రిజర్వ్​ ఆటగాళ్లు: లియామ్​ డాసన్​, రిచర్డ్​ గ్లీసన్​, తైమల్​ మిల్స్​.

ఇవీ చూడండి : బంగ్లాదేశ్‌కు లంక రివర్స్‌ కౌంటర్‌.. 'నాగిని' డ్యాన్స్ చేస్తూ సంబరాలు

కోహ్లీలో పట్టు తప్పింది.. నాకు ఆందోళనగా ఉంది: జాఫర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.