Joe Root World Cup 2023 : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. పూణే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కేవలం 28 పరుగులు మాత్రమే చేసి రూట్ పెవిలియన్ బాట పట్టాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు దిగి మెరుపులు మెరిపిస్తాడని అనుకుంటే.. ఓ నిర్లక్షమైన షాట్ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు ఒక్కసారిగా షాకైంది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
NED Vs ENG World Cup 2023 : డేవిడ్ మలన్ ఔటయ్యాక క్రీజులోకి దిగిన జో రూట్.. తొలుత నిలకడగానే ఆడాడు. అయితే ఇన్నింగ్స్‌లోని 20 ఓవర్లో లోగాన్ వాన్ బీక్ వేసిన రెండో బంతికి ర్యాంప్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే సరైన పొజిషన్‌లో లేకపోవడం వల్ల బంతి బ్యాట్‌కు మిస్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో రూట్ అనూహ్యంగా పెవిలియన్ బాట పట్టాడు. అయితే అస్సలు ఆ బంతికి రూట్ ఆ షాట్ ఆడే అవసరమే లేదు. కానీ ఆ షాట్ వల్ల ఇప్పుడు రూట్ ఔటయ్యాడు. అయితే అంతకుముందు ఓవర్‌లోనే ఇదే తరహా షాట్ ఆడి బాల్‌ను బౌండరీ దాటించాడు.
NED Vs ENG Score : ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇన్ని రోజులు పేలవ ప్రదర్శన చూపించిన ఇంగ్లాండ్ జట్టు.. ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు తమదైన శైలిలో ఆడి నెదర్లాండ్స్ జట్టు ముందు భారీ టార్గెట్ ఉంచింది. ఓపెనర్ డేవిడ్ మలన్ (87), బెన్ స్టోక్స్ (84) సెంచరీలతో సూపర్ ఇన్నింగ్స్ ఇవ్వగా.. మిగతా ప్లేయర్లు కూడా తమ వంతు సహకారాన్ని అందించారు. అలా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోరు చేశారు. ఇక మలన్, స్టోక్స్‌తో పాటు క్రిస్ వోక్స్ (45) మెరుపులతో ఇంగ్లాండ్ భారీ స్కోరు చేయగలిగింది.
వరల్డ్ కప్ 2023 సెమీస్ - ఈ రెండు గెలిస్తే ఆ నాలుగు ఔట్
క్రికెట్‌కు స్టార్ బౌలర్ గుడ్‌బై వరల్డ్‌కప్ తర్వాత రిటైర్మెంట్