Joe Root Resigns: క్రికెటర్ జో రూట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇటీవల వరుస ఓటముల నేపథ్యంలో రూట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన కెరీర్లో ఇది అత్యంత సవాలుతో కూడుకున్న నిర్ణయం అని అన్నాడు రూట్. కుటుంబం, సన్నిహితులతో చర్చించి కెప్టెన్‌గా వైదొలిగేందుకు ఇదే సరైన సమయమని భావించినట్లు వెల్లడించాడు.
గతనెలలో వెస్టిండీస్‌తో 1-0తో టెస్టు సిరీస్ ఓడింది ఇంగ్లాండ్. అంతకుముందు ఆస్ట్రేలియా చేతిలో యాషెస్ సిరీస్‌లో వైట్‌వాష్‌కు(0-4) గురైంది. అయితే.. టెస్టు కెప్టెన్‌గా ఇంగ్లాండ్‌కు ఎక్కువ విజయాలు అందించింది రూట్ కావడం విశేషం. సారథిగా మొత్తం 27 టెస్టుల్లో ఇంగ్లాండ్‌ను గెలిపించాడు 31 ఏళ్ల రూట్. మైకేల్ వాన్.. రూట్ కంటే ఒకటి తక్కువ ఉన్నాడు.
ఇవీ చూడండి: 'అతడిని భారత టీ20 జట్టులోకి తీసుకోవాల్సిందే'
హార్దిక్ పాండ్యాకు మళ్లీ ఏమైంది? బౌలింగ్ చేస్తూ ఒక్కసారిగా..