ETV Bharat / sports

Bumrah: 'అందుకే బుమ్రా సక్సెస్ అయ్యాడు' - బుమ్రా లసిత్​ మలింగ

ప్రస్తుత క్రికెట్​లోని బౌలింగ్​లో ఎన్నో మార్పులు వచ్చాయని టీమ్​ఇండియా మాజీ పేసర్ వెంకటేశ్​​ ప్రసాద్ చెప్పాడు​. బుమ్రా(Bumrah) బౌలింగ్​ అర్థంకాక బ్యాట్స్​మెన్​ తికమక పడతారని తెలిపాడు. అందుకే అతడు విజయవంతమయ్యాడని వెల్లడించాడు.

Bumrah
బుమ్రా
author img

By

Published : Jun 3, 2021, 5:44 PM IST

విచిత్రమైన బౌలింగ్‌ శైలి కలిగిన జస్ప్రీత్‌ బుమ్రా(Bumrah), లసిత్‌ మలింగ(Malinga) లాంటి పేసర్లను ఎదుర్కోవడం కష్టమని టీమ్‌ఇండియా(Team India) మాజీ పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ అన్నాడు. వారి బౌలింగ్​లో బంతులు ఎలా వస్తాయో బ్యాట్స్‌మెన్‌కు అర్థం కావని చెప్పాడు. ప్రస్తుతం క్రికెట్లో ఎన్నో మార్పులు జరిగాయని తెలిపాడు. ఆఫ్‌ కట్టర్లు, ఆఫ్‌ కట్టర్‌ బౌన్సర్‌, నకుల్‌ బాల్‌, వైవిధ్యమైన యార్కర్లు కొత్తగా పుట్టుకొచ్చాయని పేర్కొన్నాడు.

"బుమ్రా పూర్తిగా భిన్నమైన బౌలర్‌. ఎందుకంటే అతడి బౌలింగ్‌ శైలి సంప్రదాయానికి భిన్నంగా ఉంటుంది. అతడు లసిత్‌ మలింగ తరహా బౌలర్‌. బుమ్రా ఒకవైపు నుంచే బౌలింగ్‌ చేస్తున్నట్టు కనిపిస్తుంది. మలింగకు వ్యతిరేకంగా ఉంటాడు. అలాంటి బౌలర్లను ఆడటం సులువు కాదు. వాళ్ల బంతులు నేరుగా పిచ్‌ అవుతాయా? స్వింగ్‌ చేస్తారా? అర్థంకాక బ్యాట్స్‌మన్‌ తికమక పడతారు. అందుకే వారు విజయవంతం అయ్యారు. బుమ్రా భిన్నమైన శైలే అతడికెంతో ఉపయోగపడుతోంది. అందులో చాలా వైవిధ్యం ఉంటుంది"

-వెంకటేశ్‌ ప్రసాద్‌, టీమ్‌ఇండియా మాజీ పేసర్‌.

పేస్‌ బౌలింగ్‌లో చాలా మార్పులు వచ్చాయని వెంకటేశ్‌ ప్రసాద్‌ తెలిపాడు. టెస్టుల్లో వేగంగా పరుగులు చేస్తున్నారని పేర్కొన్నాడు. టీ20ల్లో వైవిధ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారని ప్రశంసించాడు. బ్యాక్‌ ఆఫ్ ది హ్యాండ్‌, ఆఫ్‌ కట్టర్‌, ఆఫ్‌ కట్టర్‌ బౌన్సర్‌, నకుల్‌ బాల్‌ లాంటివి వచ్చాయన్నాడు. యార్కర్లలోనే ఎన్నో వైవిధ్యాలు కనిపిస్తున్నాయని తెలిపాడు.

ఇదీ చూడండి 'బుమ్రా బౌలింగ్​ టెక్నిక్​ అతడికే ప్రమాదం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.