ETV Bharat / sports

అన్న బాట.. తమ్ముడి ఆట.. ఐపీఎల్​ ఛాన్స్​ కొట్టిన కశ్మీరీ ఆటగాడు.. - 2023 ఐపీఎల్​ వేలం

జమ్ముకశ్మీర్‌ నుంచి వెలుగులోకి వచ్చే క్రికెటర్లే తక్కువ. అందులోనూ విపరీతమైన పోటీ ఉండే ఐపీఎల్‌లో చోటు దక్కాలంటే చాలా కష్టం. దేశవాళీ అనుభవం చాలా తక్కువే అయినే ఆ రాష్ట్రానికి చెందిన యువ లెగ్‌స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వివ్రాంత్‌శర్మను ఫ్రాంఛైజీలు పోటీపడిమరీ సన్​రైజర్స్​ దక్కించుకుంది. రూ. 20 లక్షలతో వేలానికి వచ్చిన అతడిని సన్​రైజర్స్​.. ఏకంగా రూ. 2.6కోట్లు కొనుక్కుంది.

jammu kashmir cricket player in ipl
దేశవాళీ ఆటగాడు వివ్రాంత్‌శర్మ
author img

By

Published : Dec 25, 2022, 7:44 AM IST

జమ్ముకశ్మీర్‌.. ఇక్కడ నుంచి వెలుగులోకి వచ్చే క్రికెటర్లే తక్కువ. అందులోనూ విపరీతమైన పోటీ ఉండే ఐపీఎల్‌లో చోటు దక్కాలంటే చాలా కష్టం. ఆ కుర్రాడు కూడా అలాగే అనుకున్నాడు. ఆటనే నమ్ముకుని తీవ్రంగా శ్రమించాడు. కనీస ధర రూ.20 లక్షలతో ఈసారి వేలానికి వచ్చాడు. ఏ జట్టయినా కరుణిస్తే దశ తిరుగుతుందని అనుకున్నాడు. కానీ అతడి సుడి మామూలుగా తిరగలేదు. ఫ్రాంఛైజీలు ఈ కుర్రాడి కోసం పోటీపడ్డాయి. ఏకంగా రూ.2.6 కోట్లు కుమ్మరించాయి. దేశవాళీ అనుభవం స్వల్పమే అయినా కోట్లు పలికిన ఆ యువ లెగ్‌స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వివ్రాంత్‌శర్మ. తాజా ఐపీఎల్‌ మినీ వేలంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీ మొత్తం వెచ్చించి 23 ఏళ్ల వివ్రాంత్‌ను దక్కించుకుంది.

నాన్న చనిపోయినా..
వివ్రాంత్‌ ఇలా వెలుగు రావడంలో వెనుక అతడి అన్న విక్రాంత్‌ కష్టం ఉంది. విక్రాంత్‌ కూడా క్రికెటరే. 2020లో నాన్న సుశాంత్‌శర్మ చనిపోవడంతో వివ్రాంత్‌ క్రికెట్‌ ఆపేద్దామని అనుకున్నాడు. అన్నతో కలిసి వ్యాపారం చూసుకోవాలని భావించాడు. కానీ తాను క్రికెట్లో కొనసాగకపోయినా తమ్ముడు మాత్రం ముందుకెళ్లాలని విక్రాంత్‌ భావించాడు. అతడు క్రికెట్‌ను వదిలిపెట్టి ఇంటి బాధ్యతలు చూసుకోగా.. వివ్రాంత్‌ మాత్రం పూర్తిగా ఆటపైనే దృష్టి సారించాడు. 2021లో సౌరాష్ట్రపై లిస్ట్‌-ఎ అరంగేట్రం చేసిన ఆ ఆల్‌రౌండర్‌.. ఈ డిసెంబర్‌లోనే తొలి రంజీ మ్యాచ్‌ ఆడాడు. దీని కన్నా ముందు ఈ ఏడాది ముస్తాక్‌ అలీ టోర్నీలో 145.45 స్ట్రైక్‌రేట్‌ 4 ఇన్నింగ్స్‌ల్లో 128 పరుగులు చేశాడు వివ్రాంత్‌. ఈ టోర్నీలో కర్ణాటకతో మ్యాచ్‌లో 148 పరుగుల ఛేదనలో జట్టు 31 పరుగులకే 6 వికెట్లు నష్టపోయిన స్థితిలో ఎదురుదాడి చేసిన వివ్రాంత్‌ 46 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో జమ్ముకశ్మీర్‌ ఓడినా ఈ కుర్రాడు తన ముద్ర వేశాడు. 4.80 ఎకానమీతో 6 వికెట్లు కూడా పడగొట్టాడు. విజయ్‌హజారె ట్రోఫీలోనూ 8 ఇన్నింగ్స్‌ల్లో 395 పరుగులు చేసిన వివ్రాంత్‌ జట్టు తరఫున రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో ఉత్తరాఖండ్‌పై (125 బంతుల్లో 154) మెరుపు సెంచరీ కూడా ఉంది. వైవిధ్యమైన బంతులతో బ్యాటర్లను తికమకపెట్టి అయిదు వికెట్లు కూడా ఖాతాలో వేసుకున్నాడు.

సమద్‌ సాయంతో..
ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు అబ్దుల్‌ సమద్‌ సాయంతో సన్‌రైజర్స్‌కు నెట్‌ బౌలర్‌గా పని చేశాడు వివ్రాంత్‌. అలాగే తన పవర్‌ హిట్టింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. దేశవాళీ ప్రదర్శన.. నెట్స్‌లో అతడి ప్రతిభ చూసిన సన్‌రైజర్స్‌ భారీ మొత్తంతో వివ్రాంత్‌ను సొంతం చేసుకుంది. వేలంలో తనకు ఇంత ధర పలకడాన్ని నమ్మలేకపోతున్నానని తుది జట్టులో చోటు దక్కితే సత్తా చాటుతానని అంటున్నాడు వివ్రాంత్‌. యువరాజ్‌సింగ్‌కు వీరాభిమాని అయిన ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌.. టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా తనపై ప్రభావం చూపించాడని చెప్పాడు. "జమ్ముకశ్మీర్‌కు రెండు సీజన్లు ఇర్ఫాన్‌ పఠాన్‌ మార్గనిర్దేశకుడిగా పని చేశాడు. ఆ సమయంలో విలువైన సలహాలు ఇచ్చాడు. అతడూ లెఫ్ట్‌ హ్యాండరే కావడంతో నా ఆటను బాగా అర్థం చేసుకున్నాడు. తనకు ఐపీఎల్‌ వేలంలో కోట్లు పలకడంతో ఇర్ఫాన్‌ చాలా సంతోషించాడు" అని వివ్రాంత్‌ చెప్పాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.