ETV Bharat / sports

T20 worldcup: భారత్ ప్రదర్శనపై కపిల్​దేవ్​ కీలక వ్యాఖ్యలు​.. ఏమన్నాడంటే! - టీమ్ ఇండియా వరల్డ్​ కప్​ కపిల్​ దేెవ్

T20 World Cup : టీ20 వరల్డ్​ కప్​లో టీమ్ ఇండియా ప్రదర్శనపై భారత జట్టు మాజీ క్రికెటర్​ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్​ వరకు వెళ్లే అవకాశమే లేదన్నాడు. ఇంకా ఏమన్నాడంటే..

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Oct 19, 2022, 3:10 PM IST

T20 World Cup : టీమ్ ఇండియా ఇంకా గాడిలో పడలేదు. గాయాల సమస్యలు జట్టును వెంటాడుతున్నాయి. టైటిల్​ ఫేవరెట్ జట్లలో భారత్​ ఒకటని విశ్లేషణలు వచ్చాయి. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బ్యాటర్లు రాణించినా బౌలింగ్​లో పట్టు సాధించలేకపోతోంది. ఈ నేపథ్యంలో టీమ్​ఇండియా పరిస్థితిపై మాట్లాడాడు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్​. వరల్డ్​ కప్​లో సెమీ ఫైనల్​కు చేరడానికి కేవలం 30 శాతం అవకాశాలే ఉన్నాయని అన్నాడు.

ఇటీవల వెస్ట్రన్​ ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్​ మ్యాచ్​లో టీమ్ ఇండియా 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్​లో కేఎల్​ రాహుల్​ (74) రాణించినా ఫలితం లేకపోయింది. ప్రత్యర్థి నిర్దేశించిన 168 పరుగులను ఛేదించలేకపోయారు. అక్టోబర్ 17న ఆస్ట్రేలియా వరల్డ్​ కప్​ టీమ్​తో ఆడిన వార్మప్​ మ్యాచ్​లో గెలిచినా.. టీమ్​ ఇండియా ప్రదర్శన మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. భారీ స్కోర్​ చేసినా దాన్ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడ్డారు. ఆఖరిలో మహ్మద్​ షమీ కేవలం నాలుగు పరుగులకు 3 వికెట్లు తీసి మ్యాచ్​ను గట్టెక్కించాడు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం గాయాలే అని స్పష్టమవుతోంది. ఇదే విషయంపై కొత్త ఎన్ని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్​ బిన్నీ కూడా అందోళన వ్యక్తం చేశారు. తాను చేయాల్సిన మొట్ట మొదటి పని టీమ్​ ఇండియ ప్లేయర్లు గాయాలపాలు కాకుండా చూడడమేనని చెప్పారు. కాగా, టీమ్ ఇండియా ప్రదర్శనపై క్రికెట్​ అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

ఇవీ చదవండి : దుమారం రేపిన జైషా వ్యాఖ్యలు.. బెదిరింపులకు దిగిన పాకిస్థాన్

పేరుకే క్రీడా సంఘాలు.. కోచ్​ల కొరత.. మన ఆట ఎక్కడ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.