ETV Bharat / sports

సాహా బాటలో ఇషాంత్​.. రంజీ ట్రోఫీకి దూరం! - wriddhiman saha

Ishanth Sharma out of Ranji Trophy: వృద్ధిమాన్​ సాహా తర్వాత ఇప్పుడు ఇషాంత్​ శర్మ కూడా రంజీ ట్రోఫీ నుంచి తప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చేనెలలో శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు తనను ఎంపిక చేయరని తెలిసి.. శర్మ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ishanth Sharma out of Ranji Trophy
ఇషాంత్​ శర్మ రంజీ ట్రోఫీ
author img

By

Published : Feb 9, 2022, 7:36 PM IST

Ishanth Sharma out of Ranji Trophy: ఇషాంత్​ శర్మ.. రంజీ ట్రోఫీ నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. మొహాలి వేదికగా వచ్చేనెలలో భారత జట్టు శ్రీలంకతో ఆడే రెండు టెస్టుల సిరీస్‌కు అతడిని ఎంపిక చేయరని తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓ సీనియర్​ డీడీసీఏ సెలక్టర్​ చెప్పారు. ఇప్పటికే ఈ కారణంగా వృద్ధిమాన్​ సాహా కూడా బంగాల్‌ రంజీ జట్టు నుంచి తప్పుకొన్నాడు.

"అతడు ఆడాలని అనుకుంటే జట్టులో తీసుకుంటాం. కానీ అతడికి ఏమైందో తెలీదు గత వారం నుంచి మాకు అందుబాటులో లేడు. రంజీ ప్రాక్టీస్​ సెషన్స్​కు కూడా రాలేదు. అతడి ఆలోచన ఏమిటో తెలియదు. సాహాలా తన కెరీర్​ అయిపోయిందని ఇషాంత్​ కూడా అనుకొని ఉండొచ్చు. బుమ్రా, మహ్మద్​ షమీ, సిరాజ్​ ప్రస్తుతం భారత నెం.1,2,3 బౌలర్లు. వారు ఫిట్​గా ఉన్నారు. ఆ తర్వాత శార్దూల్​ ఠాకూర్​, ఉమేశ్​ యాదవ్​ ఫామ్​లో ఉన్నారు."

-డీడీసీఏ సెలక్టర్​.

కాగా, ఇషాంత్​ టీమ్​ఇండియా తరఫున ఇప్పటివరకు 105 టెస్టులు ఆడగా.. 311 వికెట్లు తీశాడు.

ఇదీ చూడండి: Saha team india: టెస్టులకు పక్కన పెట్టిన బీసీసీఐ.. సాహా కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.