ETV Bharat / sports

దక్షిణాఫ్రికా పర్యటనే ఇషాంత్​కు చివరిదా? - ishant sharma last assignment

Ishant Sharma last Assignment: దక్షిణాఫ్రికా పర్యటన కోసం ప్రకటించిన తుదిజట్టులో సీనియర్ పేసర్ ఇషాంత్​ శర్మతో పాటు రహానే, పుజారాలకు చోటు దక్కింది. అయితే వీరు కొంతకాలంగా సరైన ఫామ్​ కనబర్చడం లేదు. దీంతో వీరికి ఇదే చివరి సిరీస్ కావొచ్చని అందరూ భావిస్తున్నారు. కాగా, ఇదే విషయంపై స్పందించిన ఓ బీసీసీఐ అధికారి.. పరోక్షంగా వారిని హెచ్చరించాడు.

ishant sharma career, South Africa tour likely last series for Ishant Sharma, ఇషాంత్ శర్మ సౌతాఫ్రికా టూర్, ఇషాంత్ శర్మ లేటెస్ట్ న్యూస్
ishant sharma
author img

By

Published : Dec 11, 2021, 2:15 PM IST

Ishant Sharma last Assignment: త్వరలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది టీమ్ఇండియా. డిసెంబర్ 26 నుంచి ఈ జట్టుతో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం జట్టును ప్రకటించగా.. అందులో ఇషాంత్ శర్మ, రహానే, పుజారాలకు చోటిచ్చారు. వీరు కొంతకాలంగా సరైన ప్రదర్శన చేయకపోవడం వల్ల ఈ సిరీసే వీరికి చివరి అవకాశమని అంతా భావిస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై స్పందించిన ఓ బీసీసఐ అధికారి.. వారి ముగ్గురికి ఇదే చివరి టూర్ కావచ్చొని పరోక్షంగా వెల్లడించాడు.

"వైస్ కెప్టెన్​గా రహానేను తొలగించడం ఇషాంత్​ను కూడా పరోక్షంగా హెచ్చరించడమే. జట్టులో సీనియర్ పేసర్​గా అతడు జట్టుకు మరింత గొప్పగా సేవలందించాలి. పుజారాకు కూడా ఇదే వర్తిస్తుంది. చాలా కాలంగా ఇతడు సరైన ప్రదర్శన చేయట్లేదు. అతడి నుంచి అద్భుత ఇన్నింగ్స్​లను యాజమాన్యం ఆశిస్తోంది. ఒకవేళ ఈ సిరీస్​లో వారు మంచి ప్రదర్శన చేస్తే వారి టెస్టు కెరీర్​ ముందుకు సాగుతుంది. కానీ ఇషాంత్ విషయంలో మాత్రం ఇదే చివరిది కావొచ్చు."

-బీసీసీఐ అధికారి

కాగా.. శార్దూల్ ఠాకూర్, సిరాజ్ లాంటి యువ పేసర్లు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జట్టులో కీలక ఆటగాళ్లుగా మారుతున్నారు. ఇక వీరికి తోడు బుమ్రా, షమీ కూడా ఉండనే ఉన్నారు. ఇషాంత్.. జట్టులో సీనియర్ పేసర్​గా కొనసాగుతున్నాడు. కొంతకాలంగా ఇతడు టెస్టుల్లో మాత్రమే ఆడుతున్నాడు. 12 నెలల్లో 8 టెస్టులాడిన ఇషాంత్ 14 వికెట్లు మాత్రమే సాధించాడు. దీంతో దక్షిణాఫ్రికా సిరీస్ ఇతడి కీలక పరీక్ష కానుంది.

ఇవీ చూడండి: పది నెలల నిరీక్షణ ఫలించింది.. రికార్డు దక్కింది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.