ETV Bharat / sports

టీమ్​ఇండియాకు షాక్- ఆ మ్యాచ్​లకు ఇషాన్, సూర్య దూరం- కారణాలివే

Ishan Kishan Mental Health : సౌతాఫ్రికా పర్యటన నుంచి సడెన్​గా ఇషాన్ కిషన్ నిష్ర్కమించడం పట్ల బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. అతడు మానసికంగా అలసిపోయినందునే ఇషాన్ సఫారీ టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడని పేర్కొంది.

Ishan Kishan Mental Health
Ishan Kishan Mental Health
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2023, 12:51 PM IST

Updated : Dec 23, 2023, 1:09 PM IST

Ishan Kishan Mental Health : సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్​ నుంచి టీమ్ఇండియా యంగ్ బ్యాటర్​ ఇషాన్ కిషన్ తప్పుకోవడంపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. 'ఇషాన్ కిషన్ తనకు విరామం కావాల్సిందిగా మమ్మల్ని కోరాడు. ఏడాది కాలంగా నిర్విరామంగా వివిధ సిరీస్​లు, టోర్నీల్లో ఆడుతున్న కారణంగా మానసికంగా అలసిపోయినట్లు తెలిపాడు. అందుకే సఫారీలతో జరగనున్న టెస్టు సిరీస్​లో అతడి విన్నపం మేరకు విశ్రాంతినిచ్చాం' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి విరామం లేకుండా జట్టుతో ట్రావెల్​ చేస్తున్నందున ఇషాన్ మానసికంగా అలసిపోయాడు. ఇటీవల జట్టు మేనేజ్​మెంట్​ను కలిసి తన మానసిక పరిస్థితి వివరించాడు. దీంతో కొంతకాలం తనకు క్రికెట్ నుంచి రెస్ట్ ఇవ్వాల్సిందిగా బీసీసీఐను కోరగా, మేనేజ్​మెంట్ అంగీకరించింది. ఇక ఇషాన్ స్థానాన్ని కేఎస్ భరత్​తో భర్తీ చేయనున్నట్లు బీసీసీఐ ఇదివరకే ప్రకటించింది.

కాగా, ఈ ఏడాది ప్రారంభంలో ఇషాన్ కిషన్ బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఆడాడు. ఆపై ఐపీఎల్​లో ఆడిన ఇషాన్, తర్వాత జూన్​లో డబ్ల్యూటీసీ ఫైనల్​ కోసం ఇంగ్లాండ్ వెళ్లాడు. ఆ తర్వాత ఆసియా కప్, వన్డే ప్రపంచకప్​ లాంటి ప్రతిష్ఠాత్మక ఈవెంట్లలో టీమ్ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించాడు. గత నెల స్వదేశంలో అస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్​లోనూ పాల్గొన్నాడు ఇషాన్.

  • BREAKING 🚨

    Ishan Kishan opted out of the Test series because he felt mental health problems.

    He states that he has been travelling with the team all the time but getting opportunities only when someone is unavailable. pic.twitter.com/DdBOpdYNmq

    — Manjeet Singh (@manjeet85916) December 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సౌతాఫ్రికాతో రెండు టెస్టులకు భారత్‌ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముకేశ్‌ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), ప్రసిద్ధ్ కృష్ణ.

అయ్యో సూర్య : 360 డిగ్రీల ఆటగాడు సూర్యకుమార్ 7 వారాలపాటు ఆటకు దూరం కానున్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్​లో ఫీల్డింగ్ చేస్తుండగా తనను తాను కంట్రోల్ చేసుకోలేక సూర్య కింద పడ్డాడు. ఫలితంగా అతడి కాలి చీలమండంలో (Ankle) తీవ్ర గాయం అయ్యింది. దీంతో అతడు మైదానం వీడాల్సి వచ్చింది. అయితే మ్యాచ్ అనంతరం అతడు బాగానే ఉన్నట్లు తెలిపినా, తాజాగా అతడ్ని పరీక్షించిన వైద్యులు సూర్యకు సుదీర్ఘ విశ్రాంతి అవసరమని పేర్కొన్నారు. ఇక గాయం కారణంగా జనవరిలో 11నుంచి అఫ్గానిస్థాన్​తో జరిగే టీ20 సిరీస్​కు సూర్య అందుబాటులో ఉండడు.

ఫ్యామిలీ ఎమర్జెన్సీ- సడెన్​గా ఇండియాకు కోహ్లీ- ఏం జరిగింది?

సెంచరీ తర్వాత సంజూ సూపర్ సెలబ్రేషన్​ - వారికి స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చాడుగా!

Last Updated : Dec 23, 2023, 1:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.