ETV Bharat / sports

బర్త్‌డే బాయ్​ ఇషాన్​ను గిఫ్ట్ అడిగిన రోహిత్.. అదే కావాలంటూ..!

author img

By

Published : Jul 19, 2023, 11:47 AM IST

టీమ్​ఇండియా యువ బ్యాటర్ ఇషాన్‌ కిషన్ 25వ పుట్టినరోజును మంగళవారం జరుపుకున్నాడు. ప్రస్తుతం విండీస్​ టూర్​లో ఉన్న ఇషాన్​.. తన సహచర క్రికెటర్లతో కలిసి కేక్ కట్​ చేసి సెలబ్రేట్​ చేసుకున్నాడు. అయితే టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం కాస్త డిఫరెంట్​గా ఇషాన్​ నుంచే గిఫ్ట్​ను ఆశించాడు. తనకు అదే కావాలంటూ ఇషాన్​ను ఆటపట్టించాడు. ఇంతకీ ఏంటంటే?

ishan kishan rohith sharma
ishan kishan rohith sharma

Ishan Kishan Birthday Gift : సాధారణంగా మనకు తెలిసిన వారు ఎవరైనా బర్త్​డే జరుపుకుంటుంటే వారికి మనం శుభాకాంక్షలు చెప్పి ఏదొక బహుమతిని ఇస్తుంటాం. కానీ టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ మాత్రం కాస్త డిఫరెంట్​గా ఆలోచించి బర్త్‌డే బాయ్‌ దగ్గర నుంచే రిటర్న్​ గిఫ్ట్​ కావాలని కోరాడు. మంగళవారం ఇషాన్ కిషన్‌ బర్త్​డే జరగ్గా.. ఆ సమయంలో అతడిని గిఫ్ట్‌ కావాలని అడిగాడు. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటంటే..

టీమ్ఇండియా యువ బ్యాటర్ ఇషాన్‌ కిషన్‌ ప్రస్తుతం మరికొందరు టీమ్​ సభ్యులతో కలిసి విండీస్‌ పర్యటనలో ఉన్నాడు. అయితే మంగళవారం అతని బర్త్​డే జరగ్గా.. ఈ స్పెషల్‌ డేన ఇషాన్‌ ఏం చేశాడు అంటూ ఓ వీడియోను క్రియేట్​ చేసి బీసీసీఐ తన ట్విటర్‌ అకౌంట్​లో షేర్ చేసింది. అందులో ప్రాక్టీస్‌ చేయడం నుంచి కేక్‌ కటింగ్‌ వరకు ఇషాన్ లైఫ్‌ను చూపించింది. అంతే కాకుండా విండీస్‌ క్రికెట్ దిగ్గజం బ్రియాన్‌ లారాతో కూడా ఇషాన్‌ మాట్లాడిన మూమెంట్​ కూడా ఉంది.

అదే భారత జట్టుకు బహుమతి.. వెస్టిండీస్‌తో రెండో టెస్టు గురువారం నుంచి ప్రారంభం కానుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సమయంలో ఇషాన్‌ కిషన్‌ ప్రాక్టీస్‌ ముగించుకుని డగౌట్‌ వైపు వెళ్తున్నాడు. ఇక అక్కడే ఉన్న రిపోర్టర్‌ ఒకరు ఇషాన్‌ బర్త్‌డేకు మీరేం గిఫ్ట్‌ ఇస్తారని రోహిత్‌ను ప్రశ్నించాడు. దానికి సమాధానంగా హిట్​ మ్యాన్​ స్పందించిన తీరు అభిమానులను ఆకట్టుకుంది.

ఇషాన్‌నే ఈ ప్రశ్న అడుగుదామని చెప్పి.. నీకేం బహుమతి కావాలి? అని కిషన్‌ను రోహిత్ అడిగాడు. ఇషాన్‌ ఏం సమాధానం ఇవ్వకుండా నవ్వాడు. మళ్లీ రోహితే కలగజేసుకొని 'అతడికి అన్నీ ఉన్నాయి' అని అనడంతో అందరూ నవ్వేశారు. 'ఇషాన్‌ నువ్వే మాకు బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వు. విండీస్‌తో రెండో టెస్టులో సెంచరీ సాధించు. ఇదే భారత జట్టుకు ఇచ్చే బహుమతి' అని రోహిత్ అన్నాడు.

A day in the life of birthday boy - @ishankishan51 👏📷

𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦 - A 𝙎𝙋𝙀𝘾𝙄𝘼𝙇 appearance from #TeamIndia captain @ImRo45 #WIvIND pic.twitter.com/aHfW1SpYL2

— BCCI (@BCCI) July 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

India Vs West indies 2nd test : ఇక మ్యాచ్​ విషయానికి వస్తే.. విండీస్‌తో తొలి టెస్టు సందర్భంగానే టెస్ట్​ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో పరుగుల (1*) ఖాతాను తెరిచే అవకాశం మాత్రమే వచ్చింది. దీంతో గురువారం (జులై 20) నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు కోసం సిద్ధమవుతున్నాడు. ఈ మ్యాచ్ లోనే సెంచరీ చేసి తమకు గిఫ్ట్ గా ఇవ్వాలని రోహిత్ అతన్ని అడిగాడు. ఇషాన్ ఆడిన తొలి టెస్టులోనే యశస్వి, రోహిత్ సెంచరీలు చేసి ఇండియాకు భారీ విజయం కట్టబెట్టిన విషయం తెలిసిందే.

Ishan Kishan Birthday Gift : సాధారణంగా మనకు తెలిసిన వారు ఎవరైనా బర్త్​డే జరుపుకుంటుంటే వారికి మనం శుభాకాంక్షలు చెప్పి ఏదొక బహుమతిని ఇస్తుంటాం. కానీ టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ మాత్రం కాస్త డిఫరెంట్​గా ఆలోచించి బర్త్‌డే బాయ్‌ దగ్గర నుంచే రిటర్న్​ గిఫ్ట్​ కావాలని కోరాడు. మంగళవారం ఇషాన్ కిషన్‌ బర్త్​డే జరగ్గా.. ఆ సమయంలో అతడిని గిఫ్ట్‌ కావాలని అడిగాడు. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటంటే..

టీమ్ఇండియా యువ బ్యాటర్ ఇషాన్‌ కిషన్‌ ప్రస్తుతం మరికొందరు టీమ్​ సభ్యులతో కలిసి విండీస్‌ పర్యటనలో ఉన్నాడు. అయితే మంగళవారం అతని బర్త్​డే జరగ్గా.. ఈ స్పెషల్‌ డేన ఇషాన్‌ ఏం చేశాడు అంటూ ఓ వీడియోను క్రియేట్​ చేసి బీసీసీఐ తన ట్విటర్‌ అకౌంట్​లో షేర్ చేసింది. అందులో ప్రాక్టీస్‌ చేయడం నుంచి కేక్‌ కటింగ్‌ వరకు ఇషాన్ లైఫ్‌ను చూపించింది. అంతే కాకుండా విండీస్‌ క్రికెట్ దిగ్గజం బ్రియాన్‌ లారాతో కూడా ఇషాన్‌ మాట్లాడిన మూమెంట్​ కూడా ఉంది.

అదే భారత జట్టుకు బహుమతి.. వెస్టిండీస్‌తో రెండో టెస్టు గురువారం నుంచి ప్రారంభం కానుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సమయంలో ఇషాన్‌ కిషన్‌ ప్రాక్టీస్‌ ముగించుకుని డగౌట్‌ వైపు వెళ్తున్నాడు. ఇక అక్కడే ఉన్న రిపోర్టర్‌ ఒకరు ఇషాన్‌ బర్త్‌డేకు మీరేం గిఫ్ట్‌ ఇస్తారని రోహిత్‌ను ప్రశ్నించాడు. దానికి సమాధానంగా హిట్​ మ్యాన్​ స్పందించిన తీరు అభిమానులను ఆకట్టుకుంది.

ఇషాన్‌నే ఈ ప్రశ్న అడుగుదామని చెప్పి.. నీకేం బహుమతి కావాలి? అని కిషన్‌ను రోహిత్ అడిగాడు. ఇషాన్‌ ఏం సమాధానం ఇవ్వకుండా నవ్వాడు. మళ్లీ రోహితే కలగజేసుకొని 'అతడికి అన్నీ ఉన్నాయి' అని అనడంతో అందరూ నవ్వేశారు. 'ఇషాన్‌ నువ్వే మాకు బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వు. విండీస్‌తో రెండో టెస్టులో సెంచరీ సాధించు. ఇదే భారత జట్టుకు ఇచ్చే బహుమతి' అని రోహిత్ అన్నాడు.

India Vs West indies 2nd test : ఇక మ్యాచ్​ విషయానికి వస్తే.. విండీస్‌తో తొలి టెస్టు సందర్భంగానే టెస్ట్​ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో పరుగుల (1*) ఖాతాను తెరిచే అవకాశం మాత్రమే వచ్చింది. దీంతో గురువారం (జులై 20) నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు కోసం సిద్ధమవుతున్నాడు. ఈ మ్యాచ్ లోనే సెంచరీ చేసి తమకు గిఫ్ట్ గా ఇవ్వాలని రోహిత్ అతన్ని అడిగాడు. ఇషాన్ ఆడిన తొలి టెస్టులోనే యశస్వి, రోహిత్ సెంచరీలు చేసి ఇండియాకు భారీ విజయం కట్టబెట్టిన విషయం తెలిసిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.