ETV Bharat / sports

రాహుల్​ మెరుపు ఇన్నింగ్స్​.. ఇషాన్ ఇక​ నువ్వు మారవా?

author img

By

Published : Feb 1, 2023, 8:35 PM IST

Updated : Feb 1, 2023, 8:48 PM IST

న్యూజిలాండ్​తో జరుగుతున్న మూడో టీ20లో ఇషాన్ కిషన్​ మళ్లీ విఫలమయ్యాడు. ఇకపోతే రాహుల్​ త్రిపాఠి ఆడింది కాసేపే అయినా మంచి ప్రదర్శన చేశాడు. ఆ వివరాలు..

Ishan kishan Rahul Tripathi
ఇషాన్ కిషన్ రాహుల్​ త్రిపాఠి

గతేడాది బంగ్లాదేశ్‌పై వన్డేల్లో డబుల్‌ సెంచరీ చేశాక వరుస అవకాశాలు ఇస్తున్నా టీమ్​ఇండియా ప్లేయర్​ ఇషాన్‌ కిషన్‌ తన తీరును మాత్రం మార్చుకోవడం లేదు. న్యూజిలాండ్‌ సిరీస్‌లో వరుసగా విఫలమవుతున్నా ఇషాన్‌.. ప్రస్తుతం జరుగుతున్న మూడో టీ20లోనూ తక్కువ స్కోర్‌కే.. 3 బంతుల్లో ఒకే పరుగు చేసి ఔటయ్యాడు. ఇక ఔట్​ అయ్యాకు రివ్యూని కూడా వేస్ట్​ చేశాడు.

ఈ సిరీస్‌లో తొలి వన్డేలో 5, రెండో మ్యాచ్‌లో 8 నాటౌట్‌, మూడో వన్డేలో 17 పరుగులు చేసిన ఇషాన్‌.. ఆ తర్వాత టీ20 సిరీస్‌లో వరుసగా 4, 19, 1 స్కోర్లకే ఔటై అందివచ్చిన అవకాశాలను చేజార్చుకున్నాడు. దీంతో భవిష్యత్తులో జట్టులో చోటు విషయాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ (37, 2, 1 )పేలవ ప్రదర్శన చేశాడు. మొత్తంగా ఇషాన్‌ టీమ్​ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన గత 9 మ్యాచ్‌ల్లో ప్రదర్శన చూస్తే.. కేవలం 90 పరుగులు మాత్రమే చేశాడు.

రాహుల్ మెరుపు ఇన్నింగ్స్​.. ఇక ఈ మూడో టీ20లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు టీమ్​ఇండియా వన్‌డౌన్‌ బ్యాటర్‌ రాహుల్‌ త్రిపాఠి(22 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు). దీంతో అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్రీజులో ఉన్నది కాసేపే అయినా బాగా ఆడాడు. అయితే వేగంగా హాఫ్‌ సెంచరీ పూర్తి చేద్దామనే తొందరలో మరో భారీ షాట్‌కు యత్నించి ఐష్‌ సోధీ బౌలింగ్‌లో ఫెర్గూసన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

ఈ మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో కనిపించిన త్రిపాఠి ఔటైన తర్వాత చాలా బాధపడ్డాడు. ఫెర్గూసన్‌ క్యాచ్‌ పట్టగానే కోపం, బాధ రెండూ పడ్డాడు. బౌండరీ లైన్‌ క్లియర్‌ చేయలేనందుకు తనను తానే దూషించుకన్నాడు. బ్యాట్‌ను పలు మార్లు నేలకేసి కొట్టేలా కనిపించాడు. ఈ సందర్భంగా అతడు ప్రదర్శించిన హావభావాలు, అతడి బాధను చూసి నెటిజన్ల అతడికి మద్దతుగా నిలిచారు.

Last Updated : Feb 1, 2023, 8:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.