Isa Guha Commentary: ఆస్ట్రేలియా ఫేమస్ టీ20 లీగ్ బిగ్‌బాష్ మ్యాచ్‌లు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం పెర్త్ స్క్రాచర్స్-హోబర్ట్ హరికేన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. కామెంటరీ బాక్స్‌లో ఆసీస్ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో పాటు ఇంగ్లాండ్ మాజీ మహిళా క్రికెటర్ ఇసా గుహ కామెంటేటర్స్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే క్యారమ్ బాల్ గురించి వివరించే క్రమంలో ఇసా చేసిన ఓ డబుల్ మీనింగ్ కామెంట్ అందరినీ షాక్‌కు గురిచేసింది. అలాగే నవ్వుల్లో ముచ్చెత్తింది.
ఏం జరిగింది?
గిల్‌క్రిస్ట్, ఇసా గుహతో పాటు ఉన్న మరో కామెంటేటర్ క్యారమ్ బాల్ గురించి వివరించారు. కోచ్‌లు అలాంటి బంతుల్ని విసిరే వారిని ఎలా గుర్తిస్తారనే విషయం చెప్పారు. మిడిల్ ఫింగర్ (మధ్య వేలు) ఎవరికైతే ఎక్కువ పొడుగ్గా ఉంటుదో వారు క్యారమ్ బాల్ వేయడంలో గొప్పగా రాణిస్తారని.. అందుకే కోచ్‌లు అలాంటి వారికి ఆ బంతి మెళకువలు నేర్పుతారని చెప్పారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పందిస్తూ 'మీదెంత పెద్దగా ఉంది' (మధ్య వేలు) అని ఇసా అనగా.. గిల్లీతో పాటు ఉన్న మరో కామెంటేటర్ ఒక్కసారిగా షాకయ్యారు. తర్వాత తేరుకుని నవ్వు ఆపుకొంటూ కామెంటరీ కొనసాగించారు. ఈ వీడియోను మాజీ క్రికెటర్ అలెగ్జాండ్ర హార్ట్లే సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియో మీరూ చూసేయండి.
-
A reasonable question from @isaguha
— Alexandra Hartley (@AlexHartley93) December 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
👀😂😂😂😂😂😂
pic.twitter.com/Tzu5F2emUg
">A reasonable question from @isaguha
— Alexandra Hartley (@AlexHartley93) December 12, 2021
👀😂😂😂😂😂😂
pic.twitter.com/Tzu5F2emUgA reasonable question from @isaguha
— Alexandra Hartley (@AlexHartley93) December 12, 2021
👀😂😂😂😂😂😂
pic.twitter.com/Tzu5F2emUg