ప్రపంచ మహిళా క్రికెట్లో ఐర్లాండ్ బ్యాటర్ అమీ హంటర్ చరిత్ర సృష్టించింది. అతిపిన్న వయసులోనే సెంచరీ సాధించి.. భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ రికార్డును అధిగమించింది. సోమవారం జింబాబ్వేతో జరిగిన వన్డేలో 127 బంతుల్లో 121 పరుగులను నమోదు చేసి ఈ ఘనతను అందుకుంది అమీ హంటర్.
అయితే తన 16వ పుట్టినరోజు నాడే అమీ హంటర్ ఈ ఘనత సాధించి.. మహిళా క్రికెట్లో సెంచరీ సాధించిన అతిపిన్న వయస్కురాలిగా రికార్డులకెక్కింది. అంతకుముందు మిథాలీ రాజ్.. తన తొలి వన్డే సెంచరీని 16 ఏళ్ల 205 రోజుల వయసులో సాధించింది.
జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 312 పరుగుల నమోదు చేసింది. ఆ తర్వాత బరిలో దిగిన జింబాబ్వే 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పయి 227 రన్స్‌తో సరిపెట్టుకోగా.. 85 పరుగుల తేడాతో ఐర్లాండ్ గెలుపొందింది.
ఇదీ చూడండి.. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి కారణమదే: కోహ్లీ